28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

జనవరి 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’

దిల్ రాజు సమర్పణలో విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి, శిరీష్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా జనవరి 14న విడుదల కానుంది.

విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి, మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మూడోసారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ కోసం మళ్లీ చేతులు కలిపారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా క్రైమ్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ట్రైయాంగిల్ స్టొరీ సంక్రాంతికి వస్తోంది.

ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా, మీనాక్షి చౌదరి ఎక్స్ వైఫ్ గా కనిపించనుంది. చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో అందించారు, రమణ గోగుల పాడిన ఫస్ట్ సింగిల్ త్వరలో విడుదల కానుంది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, తమ్మిరాజు ఎడిటర్. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లేను ఎస్ కృష్ణ, జి ఆదినారాయణ అందించగా, వి వెంకట్ యాక్షన్ సన్నివేశాలకు కొరియోగ్రఫీ చేస్తున్నారు.

తారాగణం: వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్, ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మురళీధర్ గౌడ్, పమ్మి సాయి, సాయి శ్రీనివాస్, ఆనంద్ రాజ్, చైతన్య జొన్నలగడ్డ, మహేష్ బాలరాజ్, ప్రదీప్ కబ్రా, చిట్టి

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com