ప్రముఖ వ్యాపార దిగ్గజం గౌతం అదానీకి అమెరికాలో అరెస్టు వారెంట్ జారీ చేయటంపై బీ ఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ ఘాటుగా స్పందించారు. ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు.
అగ్రరాజ్యం అమెరికానే మోసం చేయాలని చూసిన ఘనుడు..
భారత ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వజూపిన మోసగాడు..
అదానితో కాంగ్రెస్ – బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం..అరిష్టం
ఉమ్మడి నల్గొండ జిల్లా రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఎంత ఇవ్వజూపిండో, మూసీ సుందరీకరణలో అదానీ వాటా ఎంతో!
ఇలాంటి మోసగాడికి.. దగాకోరుకా.. తెలంగాణలో పెట్టుబడుల అనుమతులు!
తక్షణం అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ అనుమతులను రద్దు చేయండి !
మీరు(సిఎం రేవంత్ రెడ్డి) అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెట్టాలి!
తెలంగాణా ఆస్తులను కొల్లగొట్టే మీ కుయుక్తులలో
మీ భడే భాయ్ వాటాఎంత?
మీ అదానీ భాయ్ వాటా ఎంత?
మీ హైకమాండ్ వాటా ఎంత?