తెలంగాణ రాష్ట్రంలో మత ఉగ్రవాదానికి సంబంధించిన చర్చల నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి బృందం రాష్ట్ర డీజీపీని కలిసింది. రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై జరుగుతున్న కుట్రలు, వక్ఫ్ బోర్డు చట్టంలోని అమెండ్‌మెంట్ ముసుగులో ముస్లిం మతోన్మాద సంస్థలు చేస్తున్న చర్యలపై వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మదర్సాలు, మసీదులలో అనుమానిత వ్యక్తులు పెద్ద ఎత్తున తిష్టవేసినట్టు సమాచారం ఉందని, వారిపై విచారణ జరిపి, రాష్ట్ర భద్రతను ప్రభావితం చేసేలా ఎవ్వరూ ఉండకుండా చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ నేతలు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ముస్లిం మతోన్మాద సంస్థలు చేపట్టే నిరసన కార్యక్రమాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదని కోరారు.
హైదరాబాద్ నగరంలో వక్ఫ్ ఆస్తులను లక్షల కోట్ల రూపాయల విలువతో కాజేసిన ఓవైసీ కుటుంబం, మత ఘర్షణలను ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్నదని వారు ఆరోపించారు. ఎంఐఎం నేతలు రాష్ట్రంలో మతోన్మాద భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని, దీనివల్ల శాంతిభద్రతలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బంగ్లాదేశ్, రోహింగ్య ముస్లింలపై తక్షణం గుర్తించి చర్యలు కోవాలని వీహెచ్‌పీ నేతలు డీజీపీని కోరారు. ఇటీవల హైదరాబాద్ నగరంలో ఐసిస్ జెండాలు ఎగరవేసిన ఘటనలపై ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు.
డీజీపీకి వినతి పత్రాన్ని సమర్పించినవారిలో వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ రావినూతల శశిధర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు డాక్టర్ సునితా రెడ్డి, జాతీయ మఠ-మందిర్ విభాగ్ సంయోజకులు ఎం.రామరాజు ఉన్నారు.