26.7 C
Hyderabad
Friday, April 17, 2026

Live Video

spot_img

వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు

ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మకి హైకోర్టులో ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ పోలీసులు వర్మపై నమోదు చేసిన మూడు కేసుల్లో ఆయనకు హైకోర్ట మంగళవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వ్యూహం సినిమా ప్రమోషన్ల సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లను కించపరుస్తూ వర్మ సామాజిక మాధ్యమాల్లో పలుపోస్టులు పెట్టాయని ప్రకాశం జిల్లాలోని పలు పోలీసుస్టేషన్లలో టీడీపీ నాయకులు కేసులు పెట్టారు. ఈ కేసులకు సంబంధించి పోలీసులు వర్మకు గతంలో నోటీసులు కూడా జారీ చేశారు. అయితే మొదటి సారి నోటీసులు జారీ చేసినప్పుడు తనకు ముందుకుగా నిర్ణయించుకున్న షూటింగులు ఉన్నందున రాలేకపోతున్నానని విచారణకు హాజరు కావడానికి నాలుగు రోజులు సమయం కావాలని వర్మ పోలీసులకు వాట్సప్ ద్వారా సందేశం పంపారు. ఆతరువాత పోలీసులు మరో గడవు విధించి తిరిగి వర్మకు నోటీసులు పంపారు. అయితే రెండో గడువుకి కూడా వర్మ విచారణకు హాజరుకాకపోవడంతో ఒంగోలు పోలీసులు ఉదయాన్నే వర్మ డెన్ కి వచ్చి కాసేపు హడావిడి చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి పోలీసులు వర్మల మధ్య దోబూచులాట జరుగుతోంది. అయితే సంబంధం లేని వ్యక్తులు తనపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు పెట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ వర్మ హైకోర్టును ఆశ్రియించారు. అలాగే వర్మకు ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఆయన తరపు న్యాయవాదులు. పిటీషన్ ని పరిశీలించిన హైకోర్టు మంగళవారం వర్మపై పెట్టిన మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com