26.7 C
Hyderabad
Wednesday, April 22, 2026

Live Video

spot_img

అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై తీర్పు వాయిదా

సంధ్యా ధియేటర్ తొక్కిసలాట కేసులో ఏ11 గా ఉన్న అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై తీర్పును నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై ఈ రోజు పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అల్లు అర్జున బెయిల్ పిటీషన్ కొట్టి వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్ధానాన్ని కోరారు. ఇక అల్లు అర్జున తరపున వాదనలు వినిపించిన సీనయర కౌన్సిల్ నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చెయ్యాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిల్ పిటీషన్ పై తీర్పును జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. సంధ్యా ధియేటర్ కేసులో ఏ11గా ఉన్న అల్లు అర్జున్ కి హైకోర్టు గత డిసెంబర్ 13వ తేదీన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే బైలు పేపర్స్ లో క్లారిటీ లేకపోవడంలో ఆదే రోజు చంచల్ గూడ జైలు నుంచి అల్లు అర్జున్ని విడుదల చేయడంలో జాప్యం జరిగింది. ఆ మరుసటి రోజు ఉదయమే అల్లు అర్జున్ని జైలు నుంచి విడుదల చేయగా పోలీసులు ఆయన్ని జూబ్లీహిల్స్ రోడ్ నెం 45లో ఉన్న గీతా ఆర్ట్స్ కార్యాలయంలో దింపి వెళ్లిపోయారు. అల్లు అర్జున్ కి హకోర్టు మంజూరు చేసిన నాలుగు వారాల మధ్యంతర బెయిల్ గడువు జనవరి పదో తేదీతో ముగయనుంది. ఈ నేపథ్యంలో జనవరి మూడో తేదీన రెగ్యులర్ బెయిల్ పై తుది తీర్పు ఏ విధంగా వస్తుందో అన్న ఉత్కంఠ అల్లు అర్జున్ అభిమానుల్లో నెలకొంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com