33.2 C
Hyderabad
Tuesday, April 21, 2026

Live Video

spot_img

వాజేడు ఎస్ఐ ఆత్మహత్యలో కొత్త కోణం

వాజేడు ఎస్ఐ హరీష్ ఆత్మహత్య వెనుక విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. హరీష్ ప్రేమించిన యువతి గతంలో ముగ్గురు యువకులను ప్రేమ పేరుతో మోసం చేసిందని, ఆ ముగ్గురిపై కేసులు కూడా పెట్టినట్లు సమాచారం.

డబ్బు, పలుకుబడి ఉన్నవారిని ఆ యువతి లొంగదీసుకుంటుందని, వారి నుంచి డబ్బులు వసూలు చేయటం పరిపాటిగా మారిందని సమాచారం. ఈ క్రమంలోనే ఎస్ఐ హరీష్‌ను కూడా ప్రేమలోకి దించిందని తెలిసింది.

హరీష్ కు వేరే అమ్మాయితో ఈ నెల 14న ఎంగేజ్మెంట్ ఉండగా.. హరీష్‌ ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ యువతి హరీష్‌తో పాటే ఉందని అంటున్నారు. ఈ విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురైన ఎస్ఐ హరీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడా? లేక యువతి బెదిరించినందుకు ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com