25.4 C
Hyderabad
Tuesday, November 3, 2026

Live Video

spot_img

చిరంజీవికి యూకే జీవిత సాఫల్య పురస్కారం

మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. బ్రిటన్‌ పార్లమెంట్‌ ఆయన సేవలను గుర్తించింది. సినీ రంగానికి అందిస్తోన్న విశేష సేవలకు గుర్తింపుగా ఆ దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. చిరంజీవికి జీవిత కాల సాఫల్య పురస్కారం అందించేందుకు యుకే పార్లమెంట్‌ నిర్ణయం తీసుకుంది.

యూకే పార్లమెంట్‌ చిరంజీవికి ఈ అవార్డు అందజేయనుంది. ఈనెల 19వ తేదీన మెగాస్టార్‌ చిరంజీవి ఈ అరుదైన గౌరవాన్ని అందుకోనున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి తొలి సినిమా.. ‘పునాదిరాళ్ళు’. ఈ సినిమాతోనే చిరంజీవి సినీ రంగంలోకి ప్రవేశించారు. అయితే, మొదట్లో అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. అనేక అవమానాలు భరించారు. చివరకు సహనం, ఓర్పుతో స్టార్‌ హీరోగా ఎదిగారు. తనకు వచ్చిన ప్రతీ అవకాశాన్ని చిరంజీవి సద్వినియోగం చేసుకుంటూ పైకి ఎదిగారు. తనదైన నటన, డ్యాన్సులతో యువతను ఎంతగానో ఆకట్టుకున్నారు. టాలీవుడ్‌లో బాక్సాఫీస్‌ రికార్డులు క్రియేట్‌ చేశారు. తొమ్మిది ఫిలింఫేర్‌ అవార్డులు, మూడు నంది అవార్డులతో పాటు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు చిరంజీవి. భారతీయ సినీ రంగానికి ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన ప్రభుత్వం 2006లో చిరంజీవికి పద్మభూషణ్‌, 2024లో పద్మవిభూషణ్‌ పురస్కారం అందించి గౌరవించింది. ఇటీవల చిరంజీవి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో కూడా చోటు దక్కించుకున్నారు. 156 చిత్రాలు.. 537 పాటలు.. 24 వేల స్టెప్పులతో అలరించినందుకు ఈ అరుదైన గిన్నిస్‌ రికార్డు ఆయనకు దక్కింది. ఇక, సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన ‘విశ్వంభర’ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పారు. వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ‘దసరా’ ఫేమ్‌ శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఈ కొత్త ప్రాజెక్ట్‌కు చిరంజీవి అంగీకరించారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com