హైదరాబాద్ పుప్పాల్ గూడలో ఓ యువ జంట హత్య కలకలం సృష్టిస్తోంది. అనంత పద్మనాభ స్వామి దేవాలయం గుట్టల్లో డబుల్ మృతదేహాలను చూసి స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. యువకుడిని కత్తుల తో పొడిచి అతి దారుణంగా హత్య చేసిన దుండగులు…యువకుడిని గుర్తు పట్ట రాకుండా ముఖంపై పెట్రోల్ పోసి కాల్చారు.
60 మీటర్ల దూరంలో మరో యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతిని రేప్ చేసి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. జంటను గుర్తు పట్ట రాకుండా ముఖాలపై బడ్డరాళ్లతో మోది చంపారు.
గాలిపటాలు ఎగురవేయడానికి వచ్చిన యువకులు… మృతదేహాలను చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగీ పోలీసులు…రంగంలోకి దిగిన డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్ బృందాలతో విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలంలో భారీగా మద్యం బాటిల్స్ గుర్తించారు.
పలు కీలకమైన ఆధారాలను క్లూస్ టీమ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. జంట హత్యలు జరిగిన స్పాట్ కు చేరుకున్న రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్… జంట హత్య జరిగిన తీరును పరిశీంచారు. రెండు రోజుల క్రితం హత్యలు జరిగినట్లు నిర్దారించారు.
ఇప్పటి వరకు చనిపోయిన జంట వివరాలు తెలియరాలేదు. వివరాలు సేకరిస్తున్నామని, స్థానికంగా ఉన్న సిసి టీవి ఫూటేజ్ ను పరిశీలించి.. త్వరలోనే హంతకులను పట్టుకుంటామని డిసిపి వెల్లడించారు. యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో యువతిపై అత్యాచారం జరిగినట్లు అనుమానాలు ఉన్నాయి. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.