తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటించిన ప్రగ్యా జైస్వాల్… తెలుగులో కంచె, ఓం నమో వెంకటేశాయ, జయ జానకి నాయక, అఖండ వంటి విజయవంతమైన సినిమాల్లో నటించింది. తాజాగా డాకు మహారాజ్ సినిమాతో ప్రగ్యా జైస్వాల్ మంచి హిట్టు కొట్టింది….సోషల్ మీడియాలో తన సొగసరి ఫోటోలు షేర్ చేసి అభిమానులను కవ్విస్తోంది.
ఆమెకు చిన్నప్పటి నుంచి నటన, నాటకాల పట్ల మక్కువ ఎక్కువ కాగా తెలుగు సినిమాల్లో తన నటనకి అవార్డులు కూడా అందుకుంది.
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించిన జైస్వాల్… పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లో న్యాయవిద్య అభ్యసించింది. లా చదువుతున్నపుడే విశ్వవిద్యాలయంలో జరిగిన అందాల పోటీల్లో పాల్గొని తన సత్తా చాటింది.
తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ బాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. టాలెంట్‌ను నిరూపించుకునేందుకు తెగ కసరత్తు చేస్తోంది.
తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’లో 2014లో అవకాశం లభించింది. అదే సమయంలో ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటరిచ్చింది. అలా ఒకే ఏడాదిలో తమిళం, తెలుగుతో పాటు హిందీలోకి ఎంట్రీ ఇచ్చింది.
2015లో మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. తరువాత క్రిష్ దర్శకత్వంలో కంచె సినిమాలో నటించింది. జైస్వాల్ గతంలో క్రిష్ తీసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ సినిమాలో చాన్స్ కోసం ఆడిషన్ ఇచ్చింది. ఆ సినిమాలో ఆమెకు పాత్ర లభించలేదు.
మత్తెక్కించే చూపులతో మాయ చేస్తున్న ప్రగ్యాజైస్వాల్… డాకు మహారాజ్ తో గ్లామర్ డోసు కూడా పెంచింది.
ప్రగ్యా జైస్వాల్ సినీ రంగంతోపాటు ఫ్యాషన్ ప్రపంచంలో కూడా రాణిస్తోంది. డోవ్,డాబర్ వాటికా, మిలీనియమ్ హైపర్ మార్కెట్ ఫర్ దుబాయ్, రిలయన్స్ డిజిటల్, ఎఫ్‌బీబీ వంటి పాపులర్ బ్రాండ్స్‌కి అంబాసిడర్‌గా చేసింది.
ఫిజికల్ ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే ఈ సొగసరి 12 జనవరి 1988లో జన్మించింది. డాకుమహారాజ్ హిట్ కావటం తనకు పుట్టిన రోజు బహుమతి అని మురిసిపోతోంది.