ట్రంప్ టారీఫ్ కత్తి దూయబోతున్నారు. అన్ని దేశాలపై తాము టారిఫ్‌లను విధిస్తామని ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అయితే ముఖ్యంగా 15 దేశాలపై మాత్రం భారీగా టారిఫ్‌లు విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ 15 దేశాలో అమెరికాపై అధికంగా టారిఫ్‌లు వసూలు చేస్తుండగా.. వాటిపైనే తాము అధికంగా టారిఫ్‌లు విధించేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, వియత్నాం, ఐర్లాండ్, జర్మనీ, తైవాన్, జపాన్, సౌత్ కొరియా, కెనడా, ఇండియా, థాయ్‌లాండ్, ఇటలీ, స్విట్జర్లాండ్, మలేషియా, ఇండోనేషియా.. ఈ 15 దేశాలను డర్టీ 15గా పిలుస్తోంది అమెరికా. రీసెంట్‌గా అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ ఈ 15 దేశాలకు డర్టీ 15 అని నామకరణం చేశారు. ఈ 15 దేశాలు అమెరికన్ గూడ్స్‌పై అధికంగా టారిఫ్‌లు విధిస్తున్నాయని చెబుతున్నారు.
ఈ 15 దేశాలు అమెరికాతో జరుపుతున్న ఎగుమతి, దిగుమతుల్లో చాలా అంతరాలు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 21 దేశాలు ఉన్నప్పటికీ ఈ 15 దేశాలపైనే ఎక్కువ టారిఫ్‌లు పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇక అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఈయూ, ఇండియా, ఇండోనేషియా, జపాన్, సౌత్ కొరియా, మలేషియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, సౌత్ ఆఫ్రికా, స్విట్జర్లాండ్, తైవాన్, థాయ్‌లాండ్, టర్కీ, యూకే, వియత్నాం దేశాలు అమెరికాతో జరిపే వాణిజ్యంలో సరైన పద్ధతులు పాటించడం లేదని అమెరికా గుర్తించినట్టు తెలుస్తోంది.
ట్రంప్ విధించే టారిఫ్‌లు ముఖ్యంగా ఫార్మా, సెమికండక్టర్, ఆటోమొబైల్స్, వారి స్పేర్‌పార్ట్స్, అల్యూమినియంపై ఉండే అవకాశం కనిపిస్తోంది.