కండిషన్స్ అప్లై అంటున్న రష్యా అధినేత..
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఎప్పుడెప్పుడు నిలిచిపోతుందనే ఆతృతలో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందుకోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ బ్లాక్ మెయిల్ చేసిన పట్టించుకోవడం లేదు. ఎదురు తిరిగి మాట్లాడినా గట్టిగా సమాధానం చెబుతున్నారు. ఇప్పుడిందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్ కాల్ మాట్లాడారు ట్రంప్. దాదాపు 2 గంటల పాటు సాగిన ఈ ఫోన్‌కాల్‌లో కీలక అంశాలపై చర్చించారు ఇరు దేశాధినేతలు. ఇప్పటికే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడీ ఫోన్‌కాల్‌తో ఈ చర్చలపై ముందడుగు పడింది.
ఫోన్‌కాల్‌లోని కీ పాయింట్స్
* ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన పుతిన్.
* కాల్పుల విరమణకు కొన్ని కండిషన్స్ పెట్టిన పుతిన్.
* ఉక్రెయిన్ ఎనర్జీ కేంద్రాలను టార్గెట్ చేయనని చెప్పిన పుతిన్
* యుద్దం ఆగాలని తాము కూడా కోరుకుంటున్నామని చెప్పిన పుతిన్
* కాల్పుల విరమణ సమయంలో మళ్లీ సైనిక శక్తిని పెంచుకోవద్దన్న పుతిన్
* అమెరికా ఆర్థిక, సైనిక సాయం ఆపేయాలని కండిషన్ పెట్టిన పుతిన్
* రెండు వారాల్లో రెండుసార్లు ఫోన్ కాల్ మాట్లాడుకున్న ట్రంప్, పుతిన్.
* ఆక్రమించిన ప్రదేశాలను తిరిగి అప్పగించేది లేదన్న పుతిన్
* కాల్పుల విరమణను వెంటనే అమల్లోకి తీసుకురావాలన్న ట్రంప్
* అనేక అంశాలపై ఓపెన్‌గా మాట్లాడుకున్నట్టు తెలిపిన రష్యా
* యుద్ధం ఆగాలంటే అమెరికా సాయం ఆగాల్సిందేనన్న రష్యా.
* తాను కూడా యుద్ధం ఆగాలని కోరుకుంటున్నట్టు తెలిపిన పుతిన్.
* 175 మంది యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు అంగీకరించిన రష్యా
* ఉక్రెయిన్ కూడా యుద్ధ ఖైదీలను అప్పగించాలన్న రష్యా.
* తదుపరి చర్చలు మిడిల్ ఈస్ట్‌లో నిర్వహించాలని అంగీకరించిన రష్యా, అమెరికా.