32 C
Hyderabad
Wednesday, June 3, 2026

Live Video

spot_img

ఐపీఎల్‌ ఆరంభానికి కౌంట్‌డౌన్.. టెన్షన్‌లో ఫ్రాంచైజీలు..

ఐపీఎల్ 18వ సీజన్‌ ప్రారంభానికి కౌంట్‌డౌన్ కంటిన్యూ అవుతోంది. అయితే సమయం దగ్గరపడుతున్న కొద్ది కొన్ని ఫ్రాంచైజీల్లో మాత్రం టెన్షన్ పెరుగుతోంది. ఎందుకంటే కొందరు కీలక ప్లేయర్స్ ఎవ్వరూ కూడా ఇంకా ఆ టీమ్స్‌తో కలవలేదు. దీనికి కారణం వారంతా గాయాల నుంచి ఇంకా కోలుకోకపోవడమే. ఎప్పటిలానే ఈసారి కూడా ప్లేయర్స్‌ను గాయాలు వెంటాడుతున్నాయి.

జస్‌ప్రీత్‌ బుమ్రా, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, అవేష్‌ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, లాకీ ఫెర్గూసన్.. ఇలా అనేక మంది ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ముంబై ఇండియన్స్ ఫాస్ట్‌ బౌలర్ బుమ్రాపై ఆ ఫ్రాంచైజీపై కొండంత ఆశలు పెట్టుకుంది. BGT సిరీస్‌ చివరి మ్యాచ్‌లో గాయపడ్డ ఈ స్టార్ ప్లేయర్‌ ఆ తర్వాత క్రికెట్‌కు దూరమయ్యాడు. వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా దూరమయ్యాడు. ప్రస్తుతం NCA రిహాబిలిటేషన్‌లో ఉన్న బుమ్రా ఫిట్‌నెస్‌కు సంబంధించి BCCI నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. దీంతో ఐపీఎల్ ఆడతాడా? లేదా? అనేది ఇప్పుడు ప్రశ్నగానే మిగిలిపోయింది.

లక్నో సూపర్ జెయింట్స్‌ది మరో కథ. మయాంక్ యాదవ్, ఆకాష్‌దీప్, మోహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్, షమర్ జోసెఫ్ ఉన్నారు. ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ ఈ సీజన్‌లో ఆడతాడా లేదా? అనే దానిపై క్లారిటీ లేదు. మోహ్సిన్, అవేష్ కూడా NCA రీహాబిలిటేషన్‌లో ఉన్నారు. ఈ ఇద్దరు బౌలర్లు లీగ్ ప్రారంభంలో ఆడకపోతే రిషబ్‌ పంత్‌కు కష్టాలు తప్పవు.

రాజస్థాన్‌ రాయల్స్‌ది మరో సమస్య. ఈ టీమ కెప్టెన్ సంజూ శాంసన్ చేతికి గాయమైంది. ప్రస్తుతం అతడి చూపుడు వేలు విరిగినట్టు తెలుస్తోంది. అతను కూడా NCA రిహాబిలిటేషన్‌కు వెళ్లాడు. అయితే అతని ఫిట్‌నెస్‌పై గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చినట్టు వచ్చింది. దీంతో అతను టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

చీలమండ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫికి దూరమైన పాట్ కమ్మిన్స్ కూడా ఇప్పటికే హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యాడు. SRH టీమ్‌తో జాయిన్ అయ్యాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com