- గొల్లుమంటున్న లక్షలాది మంది విద్యార్ధులుచదువుల కోసం వచ్చిన విద్యార్దులు
- ఒక్క ఈ మెయిల్ తో గెంటేసిన ట్రంప్
- అల్లాడుతున్న స్టూడెంట్లు.. తక్షణం పొమ్మని ఆదేశం
- లక్షల్లో భారతీయ విద్యార్ధులకు శ్రీముఖాలు
- క్యాచ్ అండ్ డిపోర్ట్ యాప్ ద్వారా పొమ్మని ఆదేశాలు
- ఉద్యమాలు, తీవ్రవాదం ప్రోత్సహిస్తే సహించం
- అలాంటి వారికి సహకరించినా,లైక్ కొట్టినా అదే గతి
- మళ్లీ రావాలనుకుంటే ఫ్రెష్ గా దరఖాస్తు
- పాస్ పోర్టులు సరెండర్ చేసి ముద్ర వేయించుకోండి
- ట్రంప్ అనూహ్య నిర్ణయాలతో విద్యార్ధులు ఆగమాగం
యూనివర్సిటీలో తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారన్న అనుమానాలపై వందలాదిమంది స్టూడెంట్ వీసాలను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇందులో మన భారతీయ విద్యార్ధులు కూడా ఉన్నారు. క్యాంపస్ లో ఉద్యమాలు చేస్తున్నారన్న ఆరోపణలపై వారి స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్లు వారంతట వారే స్వదేశాలకు వెళ్లి పోవాలని అమెరికా డిపార్టుమెంట్ ఆప్ స్టేట్ ప్రకటించింది.వీరందరి ఎఫ్ -1 వీసాలు తక్షణం రద్దయినట్లేనని తెలియచేస్తూ ఈ మెయిల్స్ కూడా పంపించింది. క్యాంపస్ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారివే కాదు.. వారికి పరోక్షంగా మద్దతు పలికి, వారి స్టేట్మెంట్లను లైక్ చేసిన వారిని, షేర్ చేసిన వారి వీసాలను కూడా అమెరికా హోం శాఖ రద్దు చేసింది. వాస్తవంగా ఎంతమందికి ఇలా శ్రీముఖాలిచ్చినది సంఖ్య తెలియనప్పటికీ, ఇందులో భారతీయ విద్యార్ధులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం 2023-2024 లో అక్కడ చదువుల నిమిత్తం చేరిన వారిలో 3.31 లక్షల మంది భారతీయ విద్యార్ధులున్నారు. దేశ ద్రోహ కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ ఈ విద్యార్ధుల వీసాలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు అమెరికా హోం సెక్రటరీ మార్కో రుబియో ప్రకటనలో తెలిపారు. ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా తమ దేశానికి విజిటర్లుగా వచ్చే వారెవరో, కాని వారెవరో నిర్ణయించే హక్కుంటుంది. ఇవాళ 300 మందినే తొలగించి ఉండొచ్చు. కానీ ఈ చర్య ప్రతీ రోజు కొన్ని రోజుల పాటూ ఉంటుంది. ఇలాంటి ఉన్మాదులు కనిపిస్తే వారి వీసాలు లాక్కోక తప్పదు అని మార్కో రుబియో అన్నారు. వీసాలు రద్దయినవారిలో స్టూడెంట్లతో పాటు విజిటర్లు ఉన్నారని ప్రతీ వీసా చూసిన తర్వాతే రద్దు చేస్తూ సంతకం చేశానని ఆయనన్నారు. ఒక దశలో విదేశీ విద్యార్ధులందరినీ పంపేశాం అనుకున్నాం.. కానీ ఇలాంటి ఏరివేత, గెంటివేతలు ఇకపై ప్రతీరోజూ ఉంటాయి. సమాజంలో చిచ్చు పెట్టే వారిని భరించేది లేదన్నారు. హోం సెక్రటరీ మార్కో రుబియో ఆఫీస్ ఈమధ్యనే క్యాచ్ అండ్ రివోక్ అనే పేరుమీద ఇలాంటి ఉద్యమకారులను ఏరివేసేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఒక యాప్ ను కూడా తీసుకొచ్చింది. హమాస్ తీవ్రవాదాన్ని, ఇతర నిషేధిత ఉగ్రవాదసంస్థలను సమర్దించే వారిని గేంటేయాలని నిర్ణయించామని, కొత్తగా వచ్చే విద్యార్ధుల దరఖాస్తులను కూడా స్క్రూటినీ సమయంలో వెరిఫై చేస్తున్నామని అన్నారు. ఎఫ్-1 వీసా మొదలుకొని, జే, ఎం ఇలా ఏ వీసా అయినా కావొచ్చు వారికి ఇలాంటి తీవ్రవాద బ్యాక్ గ్రౌండ్ ఉందంటే మాత్రం వారు అమెరికాలో అడుగు పెట్టబోరని మార్కో రుబియో తేల్చి చెప్పేశారు.
ఈ -మెయిల్ లో ఏముంది?
గెంటేసిన విద్యార్ధులకు హోం శాఖ మెయిల్స్ పెట్టింది.ఈనెల 10న ట్రంప్ ప్రభుత్వం రూపొందించిన సీబీపీ హోం యాప్ సాయంతో వారంతట వారే స్వదేశానికి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. వారి వీసాలు ఎప్పుడు పునరుద్ధరించేది మళ్లీ తెలియ చేస్తామని, యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ నేషనాలిటీ యాక్ట్ సెక్షన్ 221 (ఐ) ప్రకారం వారి వీసాలు రద్దు చేసినట్లు ప్రకటించింది. స్టూడెంట్ వీసా ఎక్స్ ఛేంజ్ కు చెందిన డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ లాండ్ సెక్యూరిటీ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ ఫోర్సుమెంట్ స్టూడెంట్ వీసాల రద్దు ప్రక్రియను ప్రోసెస్ చేయాలని ట్రంప్ ప్రభుత్వం సూచించింది. విద్యార్ధులు చదువుతున్న విద్యాసంస్థలకు సమాచారం అందించే బాధ్యత కూడా ఆ శాఖకే ఉందని కూడా ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. వీసాలు రద్దయినా ఇంకా అక్రమంగా అక్కడే ఉంటే అలాంటి వారికి జరిమానా, జైలు,నిర్బంధ క్యాంపులకు తరలించడం లాంటి శిక్షలుంటాయని తెలిపింది. సీటు రద్దయిన విద్యార్ధులెవరైనా భవిష్యత్తులో మళ్లీ అమెరికా రావాలనుకుంటే ఫ్రెష్ దరఖాస్తు పెట్టుకోవాలని వారి అర్హతను నిర్ణయించి సీటు ఇవ్వాలో వద్దో తేలుస్తామని తెగేసి చెప్పింది.
స్వదేశాలకు తిరిగి వెళుతున్న విద్యార్ధులందరూ తమ తమ వీసాలను ఎంబసీ కార్యాలయంలో వ్యక్తిగతంగా సరెండర్ చేయాలని వాటిని పరిశీలించి వ్యక్తిగతంగా రద్దు చేసినట్లు ముద్రవేయించుకోవాలని అమెరికా హోం శాఖ సూచించింది. మళ్లీ ఎవరైనా భవిష్యత్తులో అమెరికా రావాలనుకుంటే వీసా మళ్లీ ఫ్రెష్ గా దరఖాస్తు చేసుకోవాలని, అప్పటి అర్హతలను బట్టి వీసా ఇవ్వాలో వద్దో నిర్ణయిస్తామని అన్నారు.
చాలా మంది వీసా ఉంటే అమెరికాలో బర్త్ రైట్ వచ్చినట్లు భావిస్తున్నారని, ఇది చాలా దురదృష్టకరమని, వీసా అమెరికా విజిట్ చేయడానికి మాత్రమే ఉద్దేశించిందని, ఒక విజిటర్ గా మాత్రమే అనుమతి లభించినట్లని హోం సెక్రటరీ మార్కో రుబియో తెలిపారు.