28.3 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

కన్నప్ప విడుదల వాయిదా – క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు

ఏప్రిల్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన కన్నప్ప సినిమా విడుదల వాయిదా పడింది.
వీఎఫ్ఎక్స్ పనుల కోసం కొంత ఎక్కువ సమయం కావాల్సి రావడంతో, ముందుగా ప్రకటించిన తేదీకి ఈ సినిమా థియేటర్లకు రాలేదని నటి, నిర్మాత మంచు విష్ణు వెల్లడించారు. ఈమేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. అంతేకాదు.. మీడియాకు ప్రత్యేకంగా లేఖ విడుదల చేశారు.

“కన్నప్ప సినిమాను అత్యున్నత ప్రమాణాలతో రూపొందించడానికి మా టీమ్ ఎంతో కష్టపడుతోంది. వీఎఫ్ఎక్స్ పనులు పూర్తయ్యేందుకు ఇంకా కొన్ని వారాలు పడుతుందని తెలుస్తోంది. దాంతో విడుదలను వాయిదా వేయక తప్పలేదు. ఈ జాప్యం వల్ల చింతిస్తున్నాం. మీ సహనం, మద్దతుకు కృతజ్ఞతలు. త్వరలోనే కొత్త విడుదల తేదీని తెలియజేస్తాం” అని మంచు విష్ణు పేర్కొన్నారు.

మంచు ఫ్యామిలీ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో ముఖ్య పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నారు. ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా,
మంచు మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ఎపిక్ మూవీలో రుద్రుడి పాత్రలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తుండగా, మరో ముఖ్య పాత్రల్లో మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి ప్రముఖులు కనిపించనున్నారు. త్వరలోనే ఈ భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com