34.2 C
Hyderabad
Tuesday, June 2, 2026

Live Video

spot_img

ఆట మొదలు పెట్టిన ట్రంప్.. ఇక దబిడి దిబిడే..

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి గత అధ్యక్షుడు బైడెన్ తీసుకున్న 78 నిర్ణయాలను వెనక్కి తీసుకున్నాడు. అంతేకాదు తాను ఎన్నికల ప్రచారంలో ఏవైతే చెప్పాడో అందులో కొన్నింటిని అమల్లోకి తీసుకొచ్చే ఆదేశాలపై ఇప్పటికే సంతకాలు చేసేశారు దీంతో ఇన్నాళ్ల వరకు తాను చెప్పిన మాటలన్ని ఇప్పుడు కార్యరూపం దాల్చబోతున్నాయి. ఇకపై సరికొత్త అమెరికాను చూస్తారని చెప్పిన ట్రంప్.. ఇప్పుడా మాటలను నిజం చేస్తున్నారు. ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇవే.

* బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను వెనక్కి తీసుకున్న ట్రంప్
* ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలిగిన అమెరికా
* WHO నుంచి వైదొలిగిన ట్రంప్
* అమెరికాలో పుట్టే పిల్లలకు వచ్చే సహజ పౌరసత్వం రద్దు.
* క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన 1600 మంది మద్దతుదారులకు క్షమాభిక్ష
* ఈ ఘటలో నమోదైన 450 క్రిమినల్ కేసులను డిస్మిస్ చేయాలని ఆదేశాలు.
* AIను కంట్రోల్ చేసేలా బైడెన్‌ తీసుకున్న నిర్ణయాలను ట్రంప్‌ తొలగించారు.
* బోర్డర్‌లో నిర్మించే గోడకు సంబంధించిన సామాగ్రికి అమ్మేయాలని బైడెన్ నిర్ణయించారు. ట్రంప్ దానికి బ్రేక్ వేశారు.
* టిక్‌టాక్‌ను విక్రయించేందుకు 75 రోజుల సమయం ఇచ్చారు. ఈలోపు అమెరికా పెట్టుబడిదారులకు 50 శాతం వాటా విక్రయించాల్సి ఉంటుంది.
* వాక్ స్వేచ్ఛపై ఉన్న నియంత్రణను పూర్తిగా ఎత్తేయడం.
* ప్రభుత్వంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే వరకు ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగుల నియామకాలకు బ్రేక్
* ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులంతా ఆఫీసుల్లో విధులకు ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే.
* అమల్లోకి వచ్చిన ఇంధన ఎమర్జెన్సీ.
* మెక్సికో నుంచి అక్రమ వలసలను అడ్డుకునేందుకు అమెరికా దక్షిణ సరిహద్దుల్లో నేషనల్ ఎమర్జెన్సీ.
* గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో పేరు ఇకపై గల్ఫ్‌ ఆఫ్‌ అమెరికా

ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు..

* మెక్సికో, కెనడాలపై 25 శాతం టారిఫ్‌లు విధించడం. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం
* పన్నులు, చమురు ధరలు, విద్యుత్ చార్జీలు తగ్గించడం
* సైన్యాన్నీ మరింత ఆధునీకరించండం
* పలు దేశాల్లో జరుగుతున్న యుద్ధాలకు చెక్ పెట్టడం

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com