33.2 C
Hyderabad
Saturday, April 18, 2026

Live Video

spot_img

డాగి ఎలా చెబితే అలా ట్రంప్‌…

  • మస్క్ కు జై కొడుతూ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు
  • టాక్స్ పేయర్స్ మనీ వృథా నివారణకు సలహాలు
  • గత ప్రభుత్వం ఖర్చులపైనే ట్రంప్‌ దృష్టి
  • అన్ని కాంట్రాక్టులు, గ్రాంటులు సమీక్షించాలని నిర్ణయం
  • ఎబోలా నివారణా గ్రాంట్ల నిలిపివేత యాదృచ్ఛికమే..
  • ట్రంప్ తీరును తప్పుబడుతున్న సొంత పార్టీ నేతలు

ప్రభుత్వం పెట్టే వృథా ఖర్చులను నివారిస్తూ డాగి సంస్థ (డిపార్టుమెంట్ ఆఫ్‌  ఎఫిషియన్సీ) చేసిన పలు సూచనల అమలుకు ట్రంప్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్లివ్వడం వివాదంగా మారుతోంది. బిలియనీర్ ఎలన్ మస్క్ లీడ్‌ చేస్తున్న ఈ డాగి సంస్థ ప్రభుత్వ సమర్ధతను పెంచేందుకు వృథా ఖర్చుల నివారణకు సలహాలిచ్చే ఓ ప్రైవేట్‌ బోర్డు. మస్క్ సూచనల మేరకు ట్రంప్ ప్రొసీడ్‌ అవడం తదనుగుణంగా ఆదేశాలివ్వడం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వంలో వేర్వేరు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించేయాలని మస్క్ టీమ్‌ చేసిన సూచనను ఆమోదిస్తూ ట్రంప్‌ ఆదేశాలిచ్చారు. మరోవైపు అనేక పొదుపు చర్యలనూ డాగి టీమ్‌ సూచించింది. ఇందులో భాగంగా

 -ప్రతీ శాఖలోనూ విడుదల చేస్తున్న గ్రాంటులు, ఇస్తున్న కాంట్రాక్టులను తక్షణం సమీక్షించాలి.

– ప్రతీ ఖర్చుకు లెక్కా పత్రంతో పాటు ఉద్యోగి తమశాఖలో పెట్టిన ఖర్చును బహిరంగంగా వెల్డడించాలి.

-వివిధ ఏజెన్సీల హెడ్స్ తో సమన్వయం కోసం డాగ్‌ సంస్థకు ఒక లయజన్ టీమ్ ను ఇవ్వాలి.

-ప్రతీ ఏజెన్సీలోనూ ఖర్చు పెట్టిన ప్రతీ పైసాకు అధికారికంగా లెక్కలు నమోదు చేయడం

-ఏజెన్సీలో ప్రతీ పేమెంట్‌ ను ఆటోమేటిగ్గా రికార్డు చేసేందుకు కేంద్రీకృత టెక్నలాజికల్‌ వ్యవస్థ ను ఏర్పాటు చేయాలి.

ట్రంప్ భారీ మెజారిటీతో గెలిచినా ఇంకా బైడెన్ ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షిస్తూ గత ప్రభుత్వ ఫైళ్లన్నింటిని బయటకు తీసి కెలకడం పట్ల డెమో క్రట్లలోనే వ్యతిరేకత పెరగుతోంది. అయినా ట్రంప్ అడుగు ముందకే వేస్తున్నారు.

 స్పెషల్ అట్రాక్షన్ గా మస్క్

వైట్‌ హౌస్ లో ఏర్పాటు చేసిన తొలికేబినెట్‌ భేటీకి అనధికారిక హోదాలో డాగ్‌  టీమ్‌ హెడ్‌ గా హాజరైన ఎలన్‌ మస్క్ మేక్ అమెరికా గ్రేట్‌ అగైన్ క్యాప్ ను, టెక్ సపోర్ట్ అని రాసి ఉన్న టీ షర్టును ధరించి హాజరయ్యారు. తాను టెక్‌ శావీనని మస్క్ చెప్పదలచుకున్నట్లుగా అనిపిస్తోంది. డాగ్‌ సూచన మేరకే ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వ్యాధి నివారణకు నిధులు, గ్రాంటుల నిలిపివేత పొరపాటున యాదృచ్ఛికంగా జరిగిందని, ఉద్దేశపూర్వకంగా కాదని మస్క్ అంటున్నారు. అది తమ సంస్థ చేసిన పొరపాటేనని ఒప్పుకున్నారు.

డాగి అంటే ఏంటి?

ప్రభుత్వంలో వృథాఖర్చులను నివారించి వివిధ శాఖల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సలహాలు, సూచనలు ఇచ్చే ఓ ప్రైవేట్‌ అడ్వైజరీ బోర్డు డాగి DOGE (డిపార్టుమెంట్‌ ఆఫ్‌ ఎఫిషియన్సీ). దీనికి ఎలన్ మస్క్ నేతృత్వం వహిస్తున్నారు. వచ్చీరాగానే ప్రభుత్వోద్యోగుల సంఖ్య కుదించాలని సలహా ఇవ్వడంతో చాలా మందిని తొలగిస్తున్నట్లు మరికొందరికి వీఆర్‌ ఎస్ ఇచ్చేస్తూ ట్రంప్‌ ప్రభుత్వం ఓ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ పాస్ చేసింది. దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే ఇలా స్టాఫ్‌ కుదింపు వల్ల ఖజానాలో వృథాఖర్చు తొలగించినట్లవుతుందని మస్క్ సూచించారు. అదే సమయంలో మాన్యువల్‌ స్టాఫ్‌ కాకుండా, సిస్టం లింక్డ్ ఆధారిత వ్యవస్థను మరింత సింప్లిఫై చేసి అమలు చేయాలని మస్క్ సూచించారు. దాంతో ఉద్యోగులను తొలగించాలని ట్రంప్‌ నిర్ణయానికొచ్చేశారు. ఈ నిర్ణయాలేవీ సహచర డెమోక్రట్లకే నచ్చడం లేదు. అయితే డాగి సంస్థ ఏర్పాటుపై డెమోక్రాట్లలో వ్యతిరేకత ఉన్నా ఓ ఆన్‌ లైన్ పోల్‌ లో సాధారణ జనం మాత్రం మద్దతు పలకడం విశేషం. ఇంతకీ డాగి సంస్థ లో పనిచేస్తున్నవారంతా కుర్రోళ్లు, టెకీలే.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com