భారత రాష్ట్ర సమితి అధ్యకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం సందర్భంగా పార్టీ నేతలు వినూత్న కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. కెసిఆర్ పుట్టిన రోజు పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటాలని పిలుపు ఇచ్చారు. ఈ సందర్భంగా వృక్షార్చన పోస్టర్ అవిష్కరించారు. ఆయన జన్మ దిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవటమే కేసీఆర్‌కు మనం ఇచ్చే పుట్టినరోజు కానుక అన్నారు. వృక్షార్చన కార్యక్రమం తీసుకున్న పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్ కుమార్‌ను కేటీఆర్ అభినందించారు. రాష్ట్రం, దేశం పచ్చబడాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేస్తున్న ఈ వృక్షార్చనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సంతోష్ కుమార్ కోరారు. హరితసేనలోని సభ్యులందరూ మొక్కలు నాటి అందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని కోరారు.
‘హరితహారం’ ద్వారా తెలంగాణ భూతల్లికి ఆకుపచ్చని చీర చుట్టిన తొలి ముఖ్యమంత్రి, రైతుబంధు కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదినానిక విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.