కొంతమంది హీరోయిన్లు కేవలం కొన్ని సినిమాలకు మాత్రమే పరిమితం అవుతారు. చాలా మంది హీరోయిన్లు కెరీర్ లో అవకాశాలు తగ్గిన తర్వాత వేరే రంగాన్ని ఎంచుకొని ఉన్నత స్థానాన్ని అధిరోహించిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి హీరోయిన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈమె గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తెలుగులో ఒక సినిమా చేసింది. బాలీవుడ్ లో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.
ఇప్పుడు ఈమె గూగుల్ కి హెడ్ గా వ్యవహరించే స్థాయికి ఎదిగింది. ఆమె పేరు మయూరి కాంగో. ఈమె సూపర్ స్టార్ మహేష్ బాబు మూడవ చిత్రం వంశీలో ఒక హీరోయిన్ గా చేసింది. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ నమ్రత శిరోడ్కర్ కాగా.. ఆ చిత్రంలో ఒక చిన్న క్యారక్టర్ చేసింది. ఈమె 1995 వ సంవత్సరం లో నసీం అనే బాలీవుడ్ చిత్రం ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు బాలీవుడ్ సినిమాల్లో హీరోయిన్ గా, క్యారక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ వచ్చిన మయూరి 2000 సంవత్సరంలో మహేష్ బాబు హీరోగా నటించిన ‘వంశీ’ చిత్రం ద్వారా మన టాలీవుడ్ ఆడియన్స్ కి పరిచయమైంది. అప్పటి వరకు ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేస్తూ వచ్చిన మయూరి… 2000 సంవత్సరం లో మాత్రం 5 సినిమాల్లో నటించింది.
2003వ సంవత్సరంలో ఆదిత్య ధిల్లాన్ అనే ప్రముఖ NRI ని పెళ్ళాడి సినిమాలకు దూరమైంది. 2008వ సంవత్సరంలో మాత్రం ‘కాశ్మీర్ హమారా హై’ అనే సినిమాలో కనిపించింది. ఆ తర్వాత సినిమాలకు శాశ్వతంగా దూరమైంది. పెళ్లి తర్వాత న్యూయార్క్ సిటీలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ లో ఎంబియే పూర్తి చేసిన మయూరి… ఆ రంగంలో ఎంతో గొప్పగా రాణించింది. ఎన్నో అంతర్జాతీయ సంస్థల్లో సేవలు అందించిన కాంగో… ప్రస్తుతం గూగుల్ ఇండియా ఇండస్ట్రీ హెడ్ ఫర్ ఏజెన్సీ బిజినెస్ రోల్ లో పని చేస్తుంది. ఈమె నెల జీతం లక్షల్లో ఉంటుంది. ఒక స్టార్ హీరోయిన్ సంవత్సరం మొత్తం కష్టపడి పని చేసి సంపాదించే డబ్బులను ఈమె కేవలం ఆరు నెలల్లో సంపాదిస్తోంది.