29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

మహా సీఎంగా ఫడ్నవిస్ ప్రమాణం నేడే..

  • ముహూర్తం సాయంత్రం5.30… వేదిక ఆజాద్ స్టేడియం
  • డిప్యూటీ సీయంలుగా షిండే, అజిత్ పవార్ లు

మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్రఫడ్నవిస్ ఇవాళ ముచ్చటగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రులుగా ఏక్ నాథ్ షిండే,అజిత్ పవార్ కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ముంబై ఆజాద్ స్టేడియంలో సాయంత్ర 5.30కి ప్రమాణస్వీకారం జరుగుతుంది. ప్రధాని మోడీ,ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొందరు కేంద్ర మంత్రులు మరికొంతమంది వీఐపీలు,రాజకీయ,వ్యాపార ప్రముఖులు ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు.ప్రధాని పాల్గొనే కార్యక్రమం కావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు నాలుగువేలమంది భద్రతా సిబ్బంది దీనికోసం కసరత్తు చేస్తున్నారు. ముంబై ఆజాద్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ను ముందే మళ్లిస్తున్నారు.స్టేడియానికి 42 వేలమంది వస్తారని అంచనా వేస్తున్నారు. విఐపీలు రెండు వేలమంది వరకూ రావొచ్చని లెక్క తేలింది.ప్రమాణ స్వీకారానికి వచ్చే వారిలో రాజకీయనాయకులతో పాటు,పలు హిందూ పీఠాధిపతులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఘ
నిన్న ఏకనాథ్ షిండేను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు కలసి రావాలని కోరినట్లు, అది మహాయుతి కార్యకర్తల కోరిక అని చెప్పినట్లు ఫడ్నవిస్ తెలిపారు. అంతకుముందు ఫడ్నవిస్, ఏకనాథ్ షిండే, అజిత్ పవార్ గవర్నర్ రాధాక్రిష్ణన్ను కలసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ కూటమిని ఆహ్వానించాలని కోరారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com