27.5 C
Hyderabad
Monday, September 14, 2026

Live Video

spot_img

మరో ముగ్గురు బందీల విడుదల.. మిడిల్‌ ఈస్ట్‌లో తగ్గిన టెన్షన్స్

ఇజ్రాయెల్ శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది.. కాబట్టి ఈసారి బందీల విడుదల ఆలస్యమవుతుందని ప్రకటించింది. దీంతో బందీలను విడుదల చేయకపోతే ట్రంప్ నరకం చూపిస్తానన్నారు. మరో భారీ యుద్ధం తప్పదని ఇజ్రాయెల్ వార్నింగ్ ఇచ్చింది. దీంతో మళ్లీ మిడిల్‌ ఈస్ట్‌లో యుద్ధ భయాలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడీ భయాలన్నింటికి చెక్ పెట్టింది హమాస్. మరో ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసింది హమాస్. వీరిని రెడ్‌ క్రాస్‌కు అప్పగించడంతో వారు ఇజ్రాయెల్‌కు చేరుకున్నారు. దీంతో ఇజ్రాయెల్-హమాస్‌ శాంతి ఒప్పందంలో మరో ముందుడుగు పడింది. శాంతి ఒప్పందం కొనసాగుతుందా? రద్దు అవుతుందా? అనే సందేహాలు నెలకొన్న సమయంలో ఈ విషయంలో వెనకడుగు వేసేది లేదని ఇరు దేశాలు ప్రకటించినట్టైంది.

హమాస్ ముగ్గురు బందీలను విడుదల చేయడంతో దీనికి ప్రతిగా 300 మందికిపైగా పాలస్తీనియులను విడిచి పెట్టనుంది ఇజ్రాయెల్. జనవరి 19న ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందంలోని తొలి దశ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరు దేశాలు ఆరుసార్లు బందీలను విడుదల చేశాయి ఇరు దేశాలు. గతసారి బందీల విడుదల సందర్భంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంది హమాస్. ఆ సంస్థ విడుదల చేసిన ఇజ్రాయెల్ బందీలు చాలా అనారోగ్యంగా కనిపించారు. వారిని చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి అసలు వారు గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. దీంతో ట్రంప్ కూడా స్పందించారు. దీంతో ఈసారి ఆరోగ్యంగా ఉన్న బందీలనే రిలీజ్ చేసింది హమాస్.

శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్ కట్టుబడి ఉండటం లేదని.. అందుకే ఈసారి బందీల విడుదలను ఆలస్యం చేస్తామని హమాస్ ప్రకటించింది. దీంతో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ఈ ప్రకటనపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే హమాస్‌కు నరకం చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. శనివారంలోగా ఇజ్రాయెల్ బందీలందరిని విడుదల చేయాలని అల్టిమేటమ్‌ ఇచ్చారు ట్రంప్. ఇజ్రాయెల్ కూడా తిరిగి యుద్ధం ప్రారంభించేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు బందీలందరిని మాత్రం ఒకేసారి విడుదల చేయలేదు హమాస్. శాంతి ఒప్పందంలో చెప్పినట్టుగానే విడతల వారీగానే బందీలను విడుదల చేస్తామని చెప్పింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com