ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వరల్డ్ ఎకనామిక ఫోరమ్ లో ఒకే వేదిక మీదకు వచ్చారు. దావోస్‌లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
భారత దేశంలో ఈ మూడు రాష్ట్రాలు అభివ్రద్ధిలో దూసుకుపోతున్నాయి. బహుళ జాతి సంస్థలు ఈ మూడు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రులు పోటీపడి మరి సమాధానాలు ఇచ్చారు.
భారత్ నుంచి అనేక రాష్ట్రాలు దావోస్ లో స్టాల్స్ ప్రారంభించినా తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతోపాటు గుజరాత్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు పెట్టుబడుల్లో సింహభాగం అందుకున్నాయి.