- ఈ మధ్యాహ్నం రానున్న తొలి విమానం
- అందులో205మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రంట్స్
- పంజాబ్, ఢిల్లీ, గుజరాత్ లకు చెందిన వారు
- చేతులు వెనక్కి కట్టి విమానం ఎక్కిస్తున్న అధికారులు
- మేకల మందను పంపినట్లు యుద్ధ విమానంలో
- అక్రమ వలసదారులకదే ట్రీట్ మెంట్ అన్నట్రంప్
అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన భారతీయులందరినీ వెనక్కు పంపేస్తున్న ట్రంప్ అక్కడుంటున్న 7 లక్షల మంది అక్రమ వలసదారులనూ తిప్పి పంపుతానని తేల్చిచెప్పారు. అయితే వారిని వెనక్కు పంపుతున్న తీరు మాత్రం దారుణంగా ఉంది. గాలిచొరబడని యుద్ధ విమానాల్లో మేకల గుంపును కుక్కినట్లు కుక్కి పంపేస్తున్నారు. ఒకే టాయిలెట్ వసతి ఉన్న ఆవిమానంలో అందరూ అలా ఇబ్బందులు పడుతూ వెనక్కు మళ్లుతున్నారు. అక్రమ వలసదారుల చట్టబద్ధ కాగితాలను పరిశీలించడం వరకే భారత్ ప్రమేయాన్ని కోరుకున్న ట్రంప్ ఆ తర్వాత భారత విమానాలను తరలించడానికి అనుమతించలేదు. అక్రమ ఇమ్మిగ్రంట్లందరినీ పెడరెక్కలు విరిచి వెనక్కు కట్టి విమానాలకెక్కిస్తున్నారు. దీనిపై మాత్రం భారత్ ఇప్పటి వరకూ స్పందించలేదు. అమెరికాలోకి అక్రమ మార్గాల్లోకి ప్రవేశించినవారిని అలాగే ట్రీట్‌చేస్తామంటున్నారు ట్రంప్.
అమృత్ సర్ కు అమెరికా సీ-17
తొలివిడత తరలింపులో పంజాబ్, గుజరాత్, ఢిల్లీ పరిసర ప్రాంతాలకు చెందిన 104 మందిని పంపారు. వారు ఎక్కిన యుద్ధ విమానం సీ-17 చండీగడ్ లోని అమృతసర్ ఎయిర్ పోర్టులో ఈమధ్యాన్నం లాండ్ అయ్యింది. మొదటి విడతగా 104 మందిని ఇండియా తరలించింది అమెరికా. వీరిలో పంజాబ్, హర్యానా, గుజరాత్, మహారాష్ట్రలకు చెందిన ఇమ్మిగ్రెంట్స్ ఉన్నారు. ఈ తరలింపుపై స్పందించిన భారత్ అక్రమ వలసలు ఎక్కడైనా అక్రమమే. అమెరికా తన సరిహద్దులను పటిష్టం చేసుకుంటోంది. అడ్డగోలుగా వెళ్లిన వారు వెనక్కు రావల్సిందేనని కామెంట్ చేసింది. గత ఏడాది 1100 మందిని ఇలాగే వెనక్కు పంపారు. బైడెన్ హయాంలోనూ, ఒబామా హయాంలోనూ ఈ తతంగానికి ఇంత ప్రాధాన్యత లేదు. కానీ ట్రంప్ అమెరికన్స్ ఫస్ట్ నినాదంతో ఎన్నికల ప్రచారంలోకి దిగినది మొదలు అక్రమ వలసలపైనే నిరంతరాయంగా ప్రకటనలిస్తూ వచ్చారు. చివరకు ఇప్పుడు అధికారంలోకి రాగానే అన్నంత పనీ చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఒకరకంగా భారత్ కూడా సమర్ధిస్తోంది. అక్రమ వలసలు వ్యస్థీకృత నేరాలకు దారి తీస్తాయని, అమెరికాలో ఉంటున్న అక్రమ వలసదారుల్లో భారతీయులను గుర్తించే సరైన పత్రాలు (వారి ఇండియన్ నేషనాలిటీని)నిర్ధారించుకున్నాకే వెనక్కు రప్పిస్తున్నామని భారత్ ప్రకటించింది.