అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం దారుణమన్నారు ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ. శనివారం ఉదయం అల్లు అర్జున్ నివాసం వద్దకు చేరకున్న చిన్నికృష్ణ మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ మొట్టమొదటి సినిమా రాసింది నేనే అని తెలిపారు. అల్లు అర్జున్ అంటే నాకు ప్రాణం ఆయన్ని అరెస్ట్ చేశారని తెలిసిన నిన్న మధ్యహ్నం 12 గంటల నుంచి ఇప్పటి వరకూ అన్నం తినలేదన్నారు. గంగా నదిలాంటి అల్లు అర్జున్ కి మరకలంటించడానికి ప్రయత్నించే ఏ వ్యక్తి అయినా ఏ నాయకుడైన, ఏ ప్రభుత్వమైనా సర్వనాసనమైపోతారని చిన్నికృష్ణ వ్యాఖ్యనించారు. అల్లు అర్జున్ పై నింద వేయడం, అరెస్ట్ చేయడం అనేది అమానుష చర్యగా ఆయన అభివర్ణించారు. అల్లు అర్జున్ వెనకాల చిరంజీవి అనే మహాశక్తి ఉంది ఆయన ఎప్పుడూ తప్పు చెయ్యడం కానీ, తప్పు మాట్లాడటం కానీ జరగదు, అటువంటి వ్యక్తిపై కుట్రలు పన్నిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు చిన్నికృష్ణ.