వరుస ఓటములు, చెత్త ఫామ్‌తో ఇబ్బందులు పడుతూ ఇప్పటికే బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో పరువు పొగొట్టుకుంటున్న టీమిండియా ప్లేయర్లకు గట్టి వార్నింగ్ ఎదురైంది. అది కూడా టీమ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఆటగాళ్లలందరికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్టు ఇప్పుడు నేషనల్ మీడియా చెబుతోంది. ప్రస్తుతం సిరీస్‌లో 2-1తో వెనకపడి ఉంది టీంఇండియా. దీంతో ప్లేయర్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగింది. ఇలాంటి టైమ్‌లో టీమ్‌కు అండగా ఉండి.. తన ప్రణాళికలతో ముందుకు నడిపించాల్సిన కోచ్.. ప్లేయర్లపై అసహనం వ్యక్తం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి గౌతమ్ గంభీర్ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమ్ ఇండియా పర్ఫామెన్స్ అంత బాగాలేదు అని పద్ధతిగా చెప్పడం కన్నా.. చెత్తగా ఉందని చెప్పడం కరెక్ట్. శ్రీలంకపై వన్డే సిరీస్ పోయింది.. న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై సిరీస్ ఓడిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో అయితే సరేసరి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కూడా ఇప్పుడు ఆడటంపై కష్టమే అనిపిస్తోంది. దీంతో గౌతమ్‌పై కూడా ప్రెజర్ పెరుగుతోంది. అయితే తన ఫ్రస్టేషన్‌ను మొత్తం ఇప్పుడు ప్లేయర్లపై తీస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో ఎన్విరాన్‌మెంట్ అంత బాగా ఉన్నట్టు కనిపించడం లేదని తెలుస్తోంది.
మెల్‌బోర్న్‌లో టెస్ట్‌లో కొంతమంది ప్లేయర్లు వికెట్లు సమర్పించుకోవడంపై గట్టిగానే క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మెల్‌బోర్న్‌లో ఓడిపోయిన తర్వాత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కి తిరిగి వచ్చిన వెంటనే “బహుత్ హో గయా” అంటూ గౌతీ భారత జట్టు ప్లేయర్లపై కోపంగా అరిచినట్లు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ ఓ కథనాన్ని రాసింది. అంతేకాదు గ్రౌండ్‌లో కూడా కొందరు ప్రవర్తించిన తీరుపై గౌతీ ఫుల్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఫ్రీగా ఆడే టైమ్ అయిపోయిందని.. ఇకపై తాను చెప్పినట్టుగానే ఆడాల్సి ఉంటుందని చెప్పాడని తెలుస్తోంది. ముఖ్యంగా రిషబ్ పంత్ చెత్త షాట్ ఆడి ఔట్ అవ్వడం.. కోహ్లీ ఎప్పటిలాగానే అవసరం లేని బాల్‌ను టచ్ చేసి క్యాచ్‌లు ఇవ్వడం.. బ్యాట్స్‌మెన్స్ అంతా తమ బలహీనతలని బయటపెట్టడంపై గౌతీ అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది.