33.1 C
Hyderabad
Friday, November 6, 2026

Live Video

spot_img

అంటార్కిటా చమురుపై రష్యా కన్ను

మనుషులు నివసించేందుకు అస్సలు వీలుకాని.. నిత్యం మంచుతో కప్పపడి ఉండే ప్రాంతం అంటార్కిటా. ఇప్పటికే ఈ మంచు ఖండం కూడా అగ్రదేశాల కోల్డ్‌వార్‌కు గతంలో కారణమైంది. అయితే ఇప్పుడు సరికొత్తగా రష్యా ఎంట్రీతో ఈ వివాదం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే అంటార్కిటాకపై రష్యా స్పెషల్ ఫోకస్ పెట్టిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి అంటార్కిటికాలో ఇప్పటికే అనేక దేశాలు తమ స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి. పరిశోధనల పేరుతో చాలా దేశాలు అక్కడ తిష్ట వేశాయి. అయితే రష్యా అక్కడ మంచు అడుగున దాగి ఉన్న చమురుపై కన్నేసింది. అక్కడి చమురు నిక్షేపాలను బయటికి తీయాలని చూస్తున్నది.

అయితే రష్యా ఆలోచనలను పర్యావరణవేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అంటార్కిటికాలో దాదాపు 51 వేల కోట్ల బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయనేది రష్యా జియాలజిస్టులు అంచనా. అయితే ఇక్కడ రష్యా మాత్రమే కాదు.. చాలా పశ్చిమ దేశాలు కూడా ఇప్పటికే వీటిపై కన్నేశాయి. ఎక్కడైతే చమురు నిక్షేపాలు ఉన్నాయో.. ఆ ప్రాంతమంత తమదే అని ఇప్పటికే ప్రకటించింది యూకే. చిలీ, అర్జెంటీనా, రష్యాతో కలిపి మరో ఏడు దేశాలు అంటార్కిటికాలో తమ భూభాగాలు ఉన్నాయని ప్రకటిస్తున్నాయి. దీంతో ఇప్పుడు రష్యా ఓ అడుగు ముందుకు వేస్తే కొత్త వివాదానికి నాంది పలకడం ఖాయం.

నిజానికి రష్యా ఇక్కడి చమురు నిక్షేపాలపై కన్నేయడానికి ఓ కారణముంది. ఇక్కడ ఉన్న చమురును మొత్తం వెలికితీస్తే ప్రస్తుతం ఒపెక్ దేశాలను మించి ఎదుగుతుంది రష్యా. నిజానికి అంటార్కిటికాను రక్షించేందుకు 1959లోనే ఓ ఒప్పందం జరిగింది. ఇందులో రష్యా కూడా భాగంగా ఉంది. కానీ ఇప్పుడా ఒప్పందాన్ని పాటిస్తుందా? లేదా? అనేది పెద్ద అనుమానం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com