24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

అంబేద్కర్ అంటే వారికి గిట్టదు

దళపతి విజయ్ ఘాటు కామెంట్లు

అంబేద్కర్ పై హోం మంత్రి అమిత్ షా కామెంట్లపై కొత్త పార్టీ పెట్టిన తమిళ హీరో తలపతి విజయ్ కూడా స్పందించారు. దేశానికి ఉన్నతమైన రాజ్యాంగాన్నిచ్చి, పేదలు, బడుగు, బలహీన వర్గాల ఉన్నతి కోసం పరితపించిన మహాను భావుడు అంబేద్కర్ అంటే బీజేపీకి సరిపడదని ఎక్స్ వేదికగా విమర్శించారు. సామాజిక న్యాయానికి ప్రతీక అంబేద్కర్.ఆయన పేరు ఉచ్ఛరిస్తేనే మనసుకు, పెదవులకు హాయినిస్తుందని విజయ్ కామెంట్ చేశారు. తమిళ వెట్రి కళగం పేరుతో పార్టీ పెట్టిన విజయ్ వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీని సమాయత్తం చేస్తున్నారు. విజయ్ తాను అంబేద్కర్, పెరియార్ రామస్వామి, కె. కామరాజ్ నాడార్ లాంటి పెద్దల ఆశయాలతో పార్టీ నడుపుతానని తమ పార్టీ ప్రారంభ సమావేశంలోనే విజయ్ చెప్పడం ద్వారా తన అజెండాను ప్రకటించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com