28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

బలగం మొగిలయ్య ఇకలేరు

కుటుంబ విలువలను బలగం సినిమాలో కండ్లకు కట్టినట్టు చూపించిన ప్రముఖ జానపద కళాకారుడు పస్తం మొగిలయ్య కన్నుమూశారు. వరంగల్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తన పాటలో కళ్లముందు ఉంచిన మొగిలయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. మొగిలయ్య శారద తంబుర మీటుతూ, పక్కనే బుర్ర (డక్కీ) వాయిస్తూ ఆయన భార్య కొమురమ్మ ఇచ్చిన అనేక ప్రదర్శనలు వెలకట్టలేనివి. తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన “బలగం” సినిమా చివర్లో వచ్చే మొగిలయ్య పాట ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన మొగిలయ్య (67).. బలగం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా క్లైమాక్స్‌లో మొగిలయ్య పాడిన పాట అన్ని వర్గాలను ఆకట్టుకుంది. కొన్ని రోజులుగా కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. మొగిలయ్య చికిత్స కోసం బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, ప్రముఖ నటుడు చిరంజీవి, బలగం దర్శకుడు వేణు ఆర్థికసాయం చేశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబ సభ్యులు ఆయనను వరంగల్‌లోని సంరక్ష హాస్పిటల్‌కు తరలించారు. పరిస్థితి విశమించడంతో ఈరోజు(గురువారం) చివరిశ్వాస విడిచారు.

మొగిలయ్య మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బేడ బుడగ జంగాల జానపద కళారూపం ‘శారద కథల’కు బహుళ ప్రాచుర్యం కల్పించి, ఆ కళకే గొప్ప బలగంగా నిలిచిన మొగిలయ్య మరణం బడుగుల సంగీత సాహిత్య రంగానికి తీరని లోటని పేర్కొన్నారు.

 

 

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com