EPFO,GST,UPI ఆన్ లైన్ చెల్లింపుల విధానంలో మార్పులు…
ఇవాల్టి నుంచి (జనవరి 1,2025) ఈపీఎఫ్ఓ, ఆన్లైన్ పేమెంట్లకు, వంటగ్యాస్ ధరలకు సంబంధించి కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. దేశవ్యాప్తంగా దీనిపై కొన్ని కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తున్నాయి. మారనున్న ఆ కొత్త నిబంధనలేమిటో చూద్దామా?
ఈపీఎఫ్ఓ : కేంద్ర పెన్షన్ చెల్లింపుల వ్యవస్థ లో కొన్ని మార్పులు చేయడం ద్వారా కేంద్రం ఈ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తోంది. ఇకపై పెన్షనర్లు తమ పెన్షన్ ను దేశంలో ఏ బ్యాంకు నుండైనా విత్ డ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తున్నారు. ఎలాంటి వెరిఫికేషన్ ప్రొసీజర్ అవసరం లేకుండానే ఈ సౌకర్యం పొందవచ్చు. ఈపీఎఫ్ ఓ సంస్థ తన ఖాతాదారులందరికీ ఇకపై ఏటీఎం కార్డుును అందుబాటులోకి తెస్తోంది. దీనివల్ల ఏ ఏటిఎం నుంచైనా ఏ సమయంలోనైనా తమకు కావల్సిన నగదు డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ పై ఉన్న పరిమితి నిబంధనను తొందరలోనే ఎత్తేస్తున్నారు.
జీఎస్టీ : జీఎస్టీ పోర్టల్ లో టాక్స్ పేయర్స్ డీటైల్స్ కు భద్రత కల్పిస్తూ మల్టీ ఫ్యాక్టర్ అథెన్ టికేషన్ ( అనేక రకాల చెకింగ్ వ్యవస్థలు) విధానాన్ని మళ్లీ అమల్లోకి తెస్తున్నారు. 180 రోజుల లోపు డాక్యుమెంట్లకు మాత్రమే ఈ – వే బిల్లులు జనరేట్ చేసేలా మార్పులు చేశారు.
యూపీఐ : మొబైల్ వినియోగ దారులు ఆన్ లైన్ చెల్లింపులకు వాడే యూపీఐ విధానంపై ఉన్న పరిమితులను పెంచారు. గతంలో యూపీఐ ద్వారా కేవలం ఐదు వేల లోపు రూపాయలు మాత్రమే బదిలీ చేసేందుకు అవకాశం ఉండగా ఈ కొత్త ఏడాది నుంచి దాని పరిమితిని పదివేల రూపాయలకు పెంచారు. అంతేకాదు రైతులకు ఇప్పటి వరకూ ఎలాంటి ష్యూరిటీ లేని రుణాలు తీసుకునే పరిమితిలో కూడా మార్పులు చేశారు. ఇప్పటి వరకూ లక్షా 60 వేల రూపాయలు మాత్రమే వారికి రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా ఆ పరిమితిని రెండు లక్షలకు పెంచారు.రైతులకు మరింత ఆర్ధిక వెసులు బాటు కల్పించడం ద్వారా వారు మెరుగైన వ్యవసాయ విధానాలు పాటించేలా, పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తున్నట్టయ్యింది.
వీసా మంజూరీ విధానంలో మార్పులు : దీని ప్రకారం ఇవాల్టి నుంచి నాన్ ఇమ్మిగ్రంట్ వీసా దరఖాస్తు దారులు తమ వీసా అపాయింట్ మెంట్ ను ఒకసారి ఉచితంగా రీ షెడ్యూల్ చేసుకోవచ్చు. అయితే మళ్లీ మార్పులేవైనా చేయదలిస్తే మాత్రం కొత్తగా నగదు చెల్లించి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందే. వీసా మంజూరీ విధానాన్ని క్రమబద్ధీకరించి, అపాయింట్ మెంట్ల విషయంలోనూ డిసిప్లిన్ తీసుకు రావాలన్నదే కేంద్రం ఉద్దేశం.
హెచ్ వన్ బీ వీసా ప్రాసెస్ లో మార్పులు : జనవరి 17,2025 నుంచి హెచ్ వన్ బీ వీసా ప్రాసెస్ లో మార్పులు చేశారు.ఉద్యోగాలిచ్చే కంపెనీలకు, ఇండియన్ ఎఫ్ వన్ వీసా దరఖాస్తు దారులకు ఈ మార్గదర్శకాలు బాగా ఉపయోగపడతాయి.
ఎల్ పీజీ ధరలు పైపైకి : కేంద్రం ఇప్పటి వరకూ అధికారికంగా ఏమీ చెప్పక పోయినా భవిష్యత్తులో ఎల్ పీజీ ధరలు పెరిగే అవకాశముంది. ఎల్పీజీ గృహ వినియోగ సిలిండర్లలో మార్పులు లేకపోయినా, వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండర్ల ధరలు మారుతూ వస్తున్నాయి. భవిష్యత్తులో ఈరెండు రంగాల ధరలను పెంచే ఆలోచనలోనే కేంద్రం ఉంది.