ఏపీ మార్కెట్టులోకి వచ్చిన కొత్త కాఫీ బ్రాండ్..
నెలలో ఓ రోజు మాత్రమే అందుబాటులో సీఎం బ్రాండ్ కాఫీ..
ఏపీలో కొత్త కాఫీ బ్రాండ్ అందుబాటులోకి వచ్చింది. అదే సీఎం బ్రాండ్ కాఫీ. సీఎం బ్రాండ్ కాఫీ ఏంటీ..? ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం అరకు బ్రాండును ప్రమోట్ చేస్తూ కాఫీ పోడిని మార్కెట్టులోకి వదిలింది.. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్టుకు పరిచయం చేసింది. 2014-19 మధ్య కాలంలోనే సీఎంగా ఉన్న చంద్రబాబు అరకు కాఫీ బ్రాండును ప్రమోట్ చేశారు. కొన్ని నెలల క్రితం స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ఓ కార్యక్రమంలో ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వమే బ్రాండింగ్ చేసిన అరకు కాఫీ గురించి విన్నాం కానీ.. సీఎం బ్రాండ్ కాఫీ ఏంటీ..? దాని గురించి ఇప్పటి వరకు వినలేదని అనుకుంటున్నారా..? అయితే వినండి.. సీఎం బ్రాండ్ కాఫీ అంటే ఏంటో తెలుసా..? స్వయంగా సీఎం చంద్రబాబు తన స్వహస్తాలతో కాఫీ పెట్టి ఇస్తారు. ఇదే సీఎం బ్రాండ్ కాఫీ. ఈ బ్రాండ్ నెలలో ఒక్క రోజు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. అది కూడా కొన్ని గ్లాసులు మాత్రమే ఎవైలబులిటీలో ఉంటుంది. ఈ బ్రాండ్ కాఫీ నాట్ ఫర్ సేల్. అసలు విషయం ఏంటంటే.. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలి సంతకం సామాజిక భధ్రత పెన్షన్లను పెంచుతూ ఫైల్ మీదే చేశారు. పెరిగిన పెన్షన్లను అమల్లోకి తెస్తూ తొలిసారి చంద్రబాబు స్వయంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఓ నిరుపేద లబ్దిదారు ఇంటికెళ్లి.. పెన్షన్ అందించారు. అదే సందర్భంలో ఆ ఇంట్లో ఉన్నవారికి తన చేతుల మీదుగా కాఫీ పెట్టి.. ఇచ్చారు. తాను పెట్టిన కాఫీని స్వయంగా ఆస్వాదిస్తూ.. ఆ కుటుంబ సభ్యులకు కూడా ఇచ్చారు. ఇదీ సంగతి. ఆ తర్వాత నుంచి ప్రతి నెల పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటున్నారు. వీలుంటే ఆ కుటుంబంలో ఉన్న వారికి స్వయంగా కాఫీ చేసి ఇస్తున్నారు. తాజాగా జనవరి నెల పెన్షన్లను.. డిసెంబర్ 31వ తేదీనే అందించాలని ప్రభుత్వం భావించింది. పల్నాడు జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని ఓ నిరుపేద లబ్దిదారు ఇంటికెళ్లి.. పెన్షన్ అందివ్వడమే కాకుండా.. కాఫీ పెట్టి ఇచ్చారు.. అలాగే వారితో కాఫీ తాగుతూనే.. వరి కష్టనష్టాలు తెలుసుకున్నారు. వారి సమస్యలను పరిష్కరించారు. దీంతో సీఎం బ్రాండ్ కాఫీ తాగితే సమస్యలు పరిష్కారం అవుతాయంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వచ్చే నెల ఏ ఇంట్లో సీఎం కాఫీ పెడతారోనని ఇప్పటి నుంచే చర్చ జరుగుతోందట.