చెన్నై చెపాక్ వేదికగా జరిగిన CSK vs RCB మ్యాచ్‌లో చాలా హైలెట్స్ ఉన్నాయి. ఐపీఎల్ 18వ సీజన్‌లో RCBకి ఇది వరుసగా రెండో విజయం. దీనికంటే మరింత క్రేజీ విజయం ఏంటంటే.. 17 ఏళ్ల తర్వాత చెన్నైలో CSKపై RCB విజయం సాధించింది. 2008లో అంటే.. ఐపీఎల్ తొలి సిజన్‌లో రాహుల్ ద్రావిడ్ సారథ్యంలో చెన్నైలో తొలిసారి గెలిచింది RCB. ఆ తర్వాత ఎప్పుడూ కూడా CSKదే పైచేయి. RCB విధించిన 197 పరుగుల టార్గెట్‌ను చెన్నై చేజ్ చేయలేకపోయింది. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో గెలుపు RCB వశమైంది.
ఇదేకాదు ఈ మ్యాచ్‌లో మరికొన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. CSK తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సురేశ్ రైనా ఉండేవాడు. ఇప్పుడీ రికార్డును బీట్ చేశారు ఎంఎస్ ధోని. సురేష్ రైనా 176 మ్యాచ్‌లు ఆడి 4,687 పరుగులు చేశాడు. ఇప్పుడీ రికార్డును చేరిపేశాడు ధోని. 236 మ్యాచ్‌ల్లో 4,699 పరుగులు చేశాడు ధోని.
విరాట్ కోహ్లీ కూడా సరికొత్త రికార్డును సృష్టించాడు. CSKపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు కోహ్లీ. ఈ టీమ్‌ప 33 ఇన్నింగ్స్‌లు ఆడి 1,084 పరుగులు చేశాడు. దీంతో శిఖర్ ధావన్ రికార్డ్ బ్రేక్ అయ్యింది.