ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు అచ్చెన్నాయుడు. స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామని, ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు చెప్పారు. ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు ఈ యేడాది రూ.12,773 కోట్లు కేటాయించామన్నారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వరి పంటను ప్రోత్సహిస్తామన్నారు. 11 పంటలను గ్రోత్ ఇంజన్లుగా కూటమి సర్కారు పరిగణిస్తోందని, ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వృద్ధిరేటు 22.86 శాతంగా నమోదయిందన్నారు. రాయితీపై విత్తన పంపిణీ పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని అచ్చెన్న చెప్పారు.
ఏపీ వ్యవసాయ బడ్జెట్ సమగ్ర స్వరూపం ఇప్పుడు చూద్దాం…
రూ.48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్
వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.13,487 కోట్లు
ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ.40 కోట్లు
ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహకానికి రూ.61 కోట్లు
వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ.139 కోట్లు
డ్రోన్ల రాయితీకి రూ.80 కోట్లు
విత్తన రాయితీకి రూ.240 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.219 కోట్లు
పీఎం కిసాన్ అమలుకు రూ.9,400 కోట్లు
ఉచిత పంటల బీమా కోసం రూ.1,023 కోట్లు
ఉద్యానవన శాఖకు రూ.930 కోట్లు
సహకార శాఖకు రూ.239 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.300 కోట్లు
పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ.92 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ.1,112 కోట్లు
ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ.12,773 కోట్లు
మత్స్యరంగం అభివృద్ధికి రూ.540 కోట్లు
ఎన్టీఆర్ జలసిరి కోసం రూ.50 కోట్లు
గ్రోత్ ఇంజిన్లుగా 11 పంటలు
వ్యవసాయ రంగంలో తొలిసారి డ్రోన్‌ల వినియోగం