ముంబైకి చెందిన కియారా అద్వానీ… 1991లో జన్మించింది. తండ్రి సింధి కుటుంబానికి చెందిన అతను కాగా తల్లి ఐరీష్ జాతికి చెందిన వ్యక్తి. ఫగ్లీ సినిమాతో 2013లో సినీ రంగంలో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ బయోపిక్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన నటించి దేశవ్యాప్తంగా పాపులారిటి సాధించింది. కియారా తాజాగా తన అభిమానులు, మిత్రులకు గుడ్ న్యూస్ చెప్పింది.2023లో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని పెళ్లి చేసుకున్న కియారా లేటెస్ట్ గా తన భర్తతో కలిసి ఒక పోస్ట్ ద్వారా తాను ప్రెగ్నెంట్ అని రివీల్ చేసింది.
‘షేర్షా’ సినిమా సెట్స్‌లో వారిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇటీవలే వారు తమ రెండవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు.
స్టార్స్ సమంత, రకుల్ ప్రీత్ సింగ్, రియా కపూర్, ఇషాన్ కట్టార్, హ్యూమా ఖురేషి వంటి వారు కియారా, సిద్దార్థ్ పోస్టుల మీద స్పందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
షాహిద్ కపూర్ తో కలిసి ‘కబీర్ సింగ్’ సినిమాతో ఆమె పాపులారిటీ విపరీతంగా పెరిగింది.
2017 జూన్లో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు సరసన మొదటి తెలుగు చిత్రం భరత్ అనే నేనులో నటించింది.
రామ్ చరణ్‌తో వినయ విధేయ రామ అంటూ సందడి చేసిన కియారా ఆ తరువాత బాలీవుడ్ మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టింది.
ఇటీవల మెగా హీరో రామ్ చరణ్ సరసన గేమ్ చేంజర్ సినిమాలో కియారా నటించింది. అందుకే గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు రాలేదని తెలిసింది.
ప్రస్తుతం కన్నడలో ఓ సినిమా, హిందీలో మరో సినిమా చేస్తోన్న కియారా… తాజాగా ప్రెగ్నెంట్ అని ప్రకటించటంతో కొద్ది రోజులు రెండు సినిమాలు వాయిదా పడనున్నాయి.
courtesy: instagram