మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకుంది. ఇంకా నామకరణం చేసుకోని అ సినిమాను మెగా 157 పేరుతో ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కు సంబంధించి కీలక బృందాన్ని పరిచయం చేస్తూ విడుదలైన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్ ఛల్ చేస్తోంది. ఇప్పటి వరకూ చిరంజీవి నటించగా పాపులర్ అయిన పలు క్యారెక్టర్లను గుర్తు చేస్తూ ఆయా సినిమాల్లో చిరంజీవి ఫేమస్ డైలగ్ ను చెపుతూ ఒక్కొక్కరూ మెగాస్టార్ ని ఈవీడియో పరిచయం చేసుకుంటారు. దర్శకత్వ శాఖ, రచయితల బృందం, ఆర్ట్ డిపార్ట్ మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, నిర్మాతలు, చివరికి చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడిలు తమకి తాము చిరంజీవికి పరిచయం చేసుకుంటారు. ఇందులో నిర్మాతల్లో ఒకరైన చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తనని తాను చిరంజీవికి పరిచయం చేసుకుంటూ తన పేరు కొణిదెల సుస్మిత అని, ఈ చిత్రానికి ఒక నిర్మాతనని పరిచయం చేసుకుంటుంది. దీనికి రెస్పాండ్ అయిన చిరంజీవి ఇంటిపేరు ఏం చెప్పావ్ అని అడిగి సుస్మిత కొణిదెల అని చెప్పిగా… ఆ పేరుని నిలబెట్టాలని అనడం అందరినీ ఆకట్టుకుంది. మొత్తం మీద మెగా 157 బృందం పేరుతో సర్క్యులేట్ అవుతున్న ఈ వీడియా ఇప్పుడ నెట్టింట వైరల్ అవుతోంది.