23.9 C
Hyderabad
Wednesday, July 29, 2026

Live Video

spot_img

తెలంగాణ డీజీపీ రేసులో 8 మంది.

తెలంగాణ రాష్ట్ర డీజీపీ నియామాకం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు 8 మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పంపింది. రవి గుప్తా 1990 బ్యాచ్, సీవీ ఆనంద్ 1991 బ్యాచ్, డా. జితేందర్ 1992 బ్యాచ్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 1994 బ్యాచ్, కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి 1994 బ్యాచ్, బి. శివధర్ రెడ్డి 1994 బ్యాచ్, డా. సౌమ్య మిశ్రా 1994 బ్యాచ్, శిఖా గోయల్ 1994 బ్యాచ్ పేర్లను పంపింది.

అర్హతల ఆధారంగా జాబితా నుంచి ముగ్గురి పేర్లును యుపిఎస్సి ఎంపిక చేసి తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతుంది. ప్రస్తుతం తాత్కాలిక డీజీపీగా కొనసాగుతున్న డా..జితేందర్ ఈ ఏడాది సెప్టెంబర్ 6న పదవీ విరమణ చేయనున్నారు.

కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఈ ఏడాది ఆగస్టు 5న, రవి గుప్తా ఈ ఏడాది డిసెంబర్ 19న పదవీ విరమణ.
సీవీ ఆనంద్ 2028 జూన్, ఆప్టే వినాయక్ ప్రభాకర్ 2029 అక్టోబర్, బి. శివధర్ రెడ్డి 2026 ఏప్రిల్ 28, డా. సౌమ్య మిశ్రా 2027 డిసెంబర్ 30, శిఖాగోయల్ 2029 మార్చి వరకు సర్వీస్ ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు తాత్కాలిక డిజిపిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఆ సంప్రదాయాన్ని తిరగ రాస్తూ ఈ దఫా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం శివధర్ రెడ్డి వైపు అధికంగా మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయ సమాచారం. లేదంటే సివి ఆనంద్ ను ఎంపిక చేయవచ్చని సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com