చింత చచ్చినా.. పులుపు చావలేదు అన్నట్టుగా ఉంది పాకిస్థాన్ ప్రభుత్వ తీరు. కశ్మీర్ ఉగ్రదాడి విషయంలో ఇప్పటికే అనేక ఆరోపణలు ఎదుర్కోంటున్నా పాకిస్థాన్.. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ నేతల మాటల తీరు చూస్తుంటే.. అగ్నికి ఆజ్యం పోస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే పాకిస్థాన్ అనే పేరు వినిపిస్తేనే ఒక్కొక్కరి రక్తం మరిగిపోతుంది భారత్‌లో.. అలాంటి సమయంలో భారత్‌ను అణుబాంబులతో పేల్చేస్తామంటున్నారు అక్కడి నేతలు.
భారత్‌పై దాడి చేసేందుకు 130 అణుబాంబులు సిద్ధంగా ఉంచినట్లు హాట్ కామెంట్స్ చేశారు పాక్ మంత్రి హనీఫ్ అబ్బాసీ. అంతేకాదు తమ వద్ద ఘోరీ, షహీన్, ఘజ్నవి మిసైల్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఈ కడుపుమంటకు కారణం ఏంటంటే.. కశ్మీర్ ఉగ్రదాడి తర్వాత సింధూనది జలాలను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడమే. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో పాక్ మరింత ఆగ్రహవేశంతో రగిలిపోతుంది. అప్పటినుంచి పాక్ సైన్యం ఒకవైపు.. ఆ దేశ మంత్రులు మరోవైపు భారత్‌ను రెచ్చగొట్టేలే వ్యాఖ్యలు చేస్తున్నారు.
భారత్ ఒకవేళ సింధూ జలాలను నిలిపివేస్తే పూర్తి స్థాయి యుద్ధానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలు దేశంలోని వివిధ రహస్య ప్రాంతాల్లో భద్రపర్చామని భారత్ కవ్విస్తే దాడికి సిద్ధంగా ఉన్నామనేది ఆయన మాటల సారాంశం. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే చాలు పాక్ వైపు తమ అణ్వాయుధాలు దూసుకొస్తాయంటున్నారు.