25.8 C
Hyderabad
Thursday, June 25, 2026

Live Video

spot_img

మరి బంగ్లా దేశీయుల సంగతి…?

  • వెల్లువలా తరలి వస్తున్న బంగ్లా చొరబాటుదార్లు
  • మనదేశంలో ఇప్పటికే రెండు కోట్లమంది బంగ్లా దేశీయులు
  • బెంగాల్, అసోం సరిహద్దులనుంచి ఎంట్రీ
  • దేశమంతా విస్తరిస్తున్న అక్రమ చొరబాటుదార్లు
  • కులవృత్తులు, చిన్న పనులు చేసుకుంటూ జీవనం
  • మెజారిటీ చేసేవి అసాంఘీక కార్యకలాపాలే
  • నకిలీ ఐడీ, ఓటరు కార్డులతో ఎంట్రీ
  • ఉగ్రసంస్థలకు స్లీపర్ సెల్స్ లా మరికొందరు
  • ఉగ్ర కార్యకలాపాలు జరుపుతూ కొందరు
  • డ్రగ్స్,మానవ అక్రమ రవాణాతో సహా అనేక నేరాలు
  • ఇప్పటికే డ్రగ్ ట్రాఫికింగ్ రూట్ గా ఇండియా
  • తరిమేయకుండా దేశ భద్రతకు పెను ముప్పు..
  • ఇమ్మిగ్రంట్ల విషయంలో పార్టీలదీ స్వార్ధ వైఖరే..
  • అమెరికా తరహా విధానాలు అమలు జరపలేమా?

పెహల్గాం లో టూరిస్టులపై ఉగ్రదాడి ఎన్నో సవాళ్లను రేకెత్తిస్తోంది. అందుకే పాకిస్థాన్ పౌరులను గుర్తించి వెంటనే వెనక్కు పంపేయాలని కేంద్రం జారీ చేసిన ఆదేశాల గడువు ఇవాళ్టితో (27) ముగిసిపోతుంది. మరోవైపు మన దేశానికి పాక్ ఉగ్రవాదుల ముప్పుకన్నా బంగ్లా దేశీ అక్రమ వలస దారుల వల్ల పెను ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ అక్రమవలసదారులు దేశమంతా తిరుగుతూ ఎక్కడ పడితే అక్కడ అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.. మొదట బంగ్లాదేశ్ నుంచి సరిహద్దుల గుండా బెంగాల్ లోకి అడుగు పెట్టి అక్కడ నుంచి నెమ్మదిగా దేశమంతటా వివిధ వృత్తుల పేరుతో వ్యాపిస్తున్నారు.పెహల్గాం దాడి నేపధ్యంలో ఇప్పుడు ఈ అక్రమ చొరబాటుదారులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎటువంటి చెకింగ్ లేకుండానే అక్రమంగా చొరబడే వీరి వల్ల సామాజిక సమస్యలతో పాటు జాతీయ భద్రత కూడా సందేహంగా మారుతోంది.

రెండు కోట్ల మంది అక్రమవలసదారులు !!

బంగ్లాదేశ్ తో మన దేశం 4వేల కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. ఈ సరిహద్దును కాపాలా కాయడం చాలా కష్టమైన పని. అలాగని అక్కడ కంచె ఏర్పాటు చేయడం భౌగోళిక పరంగా అనువుకూడా కాదు. ఓ అంచనా ప్రకారం మన దేశంలో రెండు కోట్ల మంది బంగ్లా దేశీ చొరబాటు దారులున్నారని వీరిలో మెజారిటీ పశ్చిమ బెంగాల్‌, అసోం, త్రిపుర మేఘాలయాలో ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి.
వీరంతా ఏదో పనిచేసుకు బతికేవారు. అతి తక్కువ జీతాలకే అన్ స్కిల్డ్ లేబర్ లా కొనసాగుతున్నారు. భవన నిర్మాణ కూలీలు, ఇళ్లలో పనివారుగా, వ్యవసాయ రంగంలో కూలీల్లాగా బతుకుతున్నారు. అసంఘటిత రంగంలో మెజారిటీ వీరిదే.

నేర సామ్రాజ్యంలో కూడా వీరే…

నేర సామ్రాజ్యంలో కూడా వీరి భాగస్వామ్యం ఎక్కువే.స్మగ్లింగ్, డ్రగ్స్ రవాణా, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఎక్కువ మంది కొనసాగుతు న్నారు.మరికొందరు చిల్లర,మల్లర వ్యాపకాలతో అల్లరి చిల్లరి నేరస్థులుగా కొనసాగుతుంటే మరికొందరు నకిలీ డాక్యుమెంట్లతో రాజకీయ కార్యకలాపాలు కూడా జరుపుతున్నారు. ఇది మన సమాజానికే అతిపెద్ద సమస్యగా మారుతోంది. ఉగ్రవాద కార్యకలాపాలలో కూడా ఉన్న వీరందరినీ వెంటనే గుర్తించి దేశం బయటకు పంపేయాల్సిన అవసరాన్ని తాజా సంఘటనలు తెలియచెబుతున్నాయి. కొందరు క్రైమ్ సిండికేట్లుగా మారి మానవ అక్రమ రవాణా,ఆయుధాల స్మగ్లింగ్,ఉగ్రవాదానికి ఆర్థిక సాయం చేయడం, ఉగ్రవాదసంస్థలతో అంటకాగటం, మన దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించడం లాంటి చర్యలకు పూనుకుంటున్నారు. కటిక పేదరికం నుంచి వచ్చే వీరంతా డబ్బులకు ప్రలోభాలకు సులభంగా ఆశపడతారు. మురికి వాడల్లో ఉంటూ అక్రమ నేర సామ్రాజ్యాన్ని విస్తరిస్తారు.కొందరు ఉగ్రవాద సంస్థలకు స్లీపర్ సెల్స్ లా కూడా పనిచేస్తుంటారు.

డ్రగ్ ట్రాఫికింగ్ బెడద…

బంగ్లాదేశ్ కు అతి సమీపంలో గోల్డెన్ ట్రయాంగిల్ (మాదక ద్రవ్యాల సాగు) ఉండటంతో పెద్ద ఎత్తున డ్రగ్ ట్రాఫికర్లుగా వీరంతా చెలామణీ అవుతుంటారు.ఇలాంటి వారికి మన దేశం ఒక రవాణా కేంద్రంగా మారుతోంది. ఇతర దేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తూ ఆ నగదుతో అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు.

ఉగ్రవాద సంస్థల ప్రమేయం…

ఈ అక్రమ చొరబాటు దార్లను ఉగ్రవాదసంస్థలు తమ కార్యకలాపాలకు వినియోగించుకునే అవకాశాన్ని మన నిఘా వర్గాలు కొట్టి పారేయడం లేదు. సరిహద్దుల గుండా చొరబడటం, తప్పించుకుపోవడం, సులభంగా వెళ్లిరావడం వీరికి మాత్రమే వచ్చిన విద్య.. దాంతో ఉగ్ర సంస్థలు తమ విచ్ఛిన్నకర ప్రణాళికలకు వీళ్లని స్లీపర్ సెల్స్ లా వాడుకుంటున్నాయి. ఈమధ్య కాలంలో అనేక చోట్ల జరిగిన బాంబుదాడుల్లో బంగ్లాదేశీ చొరబాటు దార్ల ప్రమేయం ఉందని తేలింది కూడా. దేశంలో ఇప్పటికే తీవ్రవాదులు పెరుగుతున్న నేపధ్యంలో వేర్పాటు వాద ఉద్యమాలు బలపడుతున్న సంఘటనలు కూడా పెరుగుతున్నాయి. ఇది మన భద్రతకే పెద్ద సవాల్ గా మారుతోంది. బంగ్లాదేశ్ నుంచి వరదలా వస్తున్న ఈ చొరబాటుదార్ల వల్ల మన దేశ భద్రత, స్థిరత్వం కూడా సవాల్ గా మారుతోంది.

చొరబాట్లకు అమెరికా కళ్లెం…

మనలాగే అమెరికా కూడా మెక్సికో నుంచి అక్రమ వలసదారుల చొరబాట్లను ఎదుర్కొంటోంది. అందుకే ఇప్పుడా దేశం ఇమ్మిగ్రంట్లను తరిమేస్తోంది.సరైన పత్రాలు, చెకింగ్ లేకుండా వచ్చే అక్రమ వలసదారులతో జాతి భద్రతే కాదు ఆర్థిక భద్రత కూడా ప్రమాదంలో పడుతోంది.అందుకే అక్రమ చొరబాట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ట్రంప్ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వ్యవస్థ మన దేశంలో కూడా రావాలసిన అవసరం ఉంది. పైగా మనదేశానికి బంగ్లాదేశ్ కి సాంస్కృతిక పరంగా, చారిత్రక పరంగా సంబంధాలున్నాయి. అందువల్ల ఈ చొరబాట్ల తాకిడి మరింత ఎక్కువ.

చొరబాటుదార్లను గుర్తించే మెకానిజం…

సరిహద్దులు చాలా బలహీనంగా ఉండటం, రెండు దేశాల మధ్య దౌత్యపరమైన సహకారం లేనందున ఈ అక్రమ చొరబాటు దార్లను గుర్తించి వెనక్కు పంపండం చాలా కష్టం అవుతోంది. కోట్లల్లో తరలి వస్తున్న వీరు దేశ భద్రతకు ముప్పుగా మారుతున్నారు. వీరి వల్లనే నేరాల సంఖ్య గతంలో కంటే పెరిగింది. దొంగ ఆధార్, రేషన్ కార్డులను,ఓటర్ ఐడెంటిటీ కార్డులను పుట్టించి ఇండియన్లలాగే కొనసాగుతున్నారు.

రాజకీయ పార్టీల ప్రమేయం…

రాజకీయ పార్టీలకు వీరొక గెలుపు అస్త్రం. మురికివాడలే వీరి వెన్ను.. దన్ను. ఇమ్మిగ్రెంట్లను వెనకేసుకు రావడంలో రాజకీయ పార్టీలు కూడా నాటకాలు ఆడుతున్నాయి. పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ వలసదారులందరికీ ఐడీ కార్డులు, ఓటరు కార్డులు ఇచ్చి మన దేశీయులుగా కొనసాగిస్తోందన్నది ప్రధాన ఆరోపణ. ఎన్నికల్లో గెలుపు కోసం మైనారిటీ ఓట్ల వేటలో భాగంగా ఇటు కాంగ్రెస్, అటు తృణమూల్ కూడా అక్రమ చొరబాటు దార్లను ప్రోత్సహిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. సరిహద్దులకు ఫెన్సింగ్ వేయడం, నిఘా వ్యవస్థను పెంచడం, పెట్రోలింగ్ జరపడం, సరైన డాక్యుమెంట్లను గుర్తించే విధానాన్ని అమలు చేయడం ద్వారా ఈ చొరబాటుదార్లందరినీ గుర్తించి వెనక్కు పంపేయాల్సిందే. అమెరికాలాగా చొరబాటుదార్లను తిప్పి పంపే బలమైన నెట్ వర్క్, విధానం మనకూ అవసరమే.

రెండు రోజులక్రితం దాడుల్లో గుజరాత్, అహ్మదాబాద్, సూరత్ లలో దాదాపు వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీ ఇమ్మిగ్రంట్లను అదుపులోకి తీసుకున్నారు.మనదేశంలో సామాన్య ప్రజల సంక్షేమమే కష్టంగా మారిన తరుణంలో ఈ అదనంగా చేరుతున్న మందని పోషించడం అంటే అది దేశానికీ భారమే. పైగా వీరి నుంచి తలెత్తే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈమధ్యనే అరెస్టయిన ఇద్దరు బంగ్లా దేశీయులు ఆల్ కాయిదా స్లీపర్ సెల్స్ గా పనిచేస్తున్నారని దర్యాప్తులో తేలింది.పెహల్గాం ఘటన నేపధ్యంలోనైనా కేంద్రం బంగ్లాదేశీ చొరబాటు దార్లను పంపేయాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com