35.2 C
Hyderabad
Thursday, May 21, 2026

Live Video

spot_img

గెలుపు మనదే.. సిరీస్ మనదే..

కటక్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విక్టరీ సాధించింది. దీంతో మ్యాచ్‌లో గెలుపుతో పాటు 2-0 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. నిజానికి టీమిండియా ముందు 305 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది ఇంగ్లండ్. నిజానికి ఇంగ్లండ్ టాపార్డర్ అదరగొట్టింది. డకెట్, సాల్ట్ మొదటి నుంచి భారత బౌలర్లపై ఎదురుదాడి చేశారు. హర్షిత్, షమీ, హార్దిక్‌ బౌలింగ్‌లో పరుగుల వరద పారించాడు. అయితే తన కెరీర్‌లో ఫస్ట్‌ వన్‌ డే మ్యాచ్‌ ఆడుతున్న వరుణ్‌ చక్రవర్తి ఈ జోడిని బ్రేక్ చేవాడు. 11వ ఓవర్‌లో సాల్ట్ 26 పరుగల వద్ద ఔటయ్యాడు. ఇక 16వ ఓవర్‌లో డకెట్‌ను 65 పరుగుల వద్ద జడేజా కూడా ఔట్ చేయడంతో మ్యాచ్‌ స్కోర్ స్లో అయిపోయింది. ఆ తర్వాత రూట్, బ్రూక్‌ మరో వికెట్‌కు ఏకంగా 62 పరుగులు చేశారు. ఆ తర్వాత బట్లర్ కూడా కాస్త దూకుడుగా ఆడటం.. చివర్లో లివింగ్‌ స్టన్‌ మెరుపులతో ఇంగ్లండ్‌ స్కోర్ 300 దాటింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు హిట్‌మ్యాన్‌ నేనున్నానుగా అన్నట్టుగా చెలరేగిపోయాడు. తాను క్రీజులో ఒక్కసారి కుదురుకుంటే ఎలా ఉంటుందో చాలా రోజుల తర్వాత అందరికి చూపించాడు. ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు రోహిత్. మరో ఎండ్‌లో గిల్‌ కూడా తానేం తక్కువ కాదంటూ దూకుడుగా ఆడాడు. దీంతో 16 ఓవర్లకే ఒక్క వికెట్‌ నష్టపోయకుండా 167 పరుగులు చేసింది టీమిండియా. అయితే ఆ తర్వాత ఓవర్టన్‌ గిల్‌ బౌలింగ్‌లో ఔట్ అవ్వడం.. ఆ వెంటనే పరుగుల వరద పారిస్తాడనుకున్న కోహ్లీ 5 పరుగులకే వెనుదిరగడంతో మ్యాచ్‌ కాస్త స్లో అయిపోయింది.

గిల్, కోహ్లీ వెనుదిరిగినా రోహిత్ మాత్రం అస్సలు ఆగలేదు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ కంటిన్యూ చేశాడు. 26 ఓవర్‌లో లాంగాఫ్‌లో సిక్స్‌ బాది తన కెరీర్‌లో 32వ సెంచరీ చేశాడు. కేవలం 72 బంతుల్లోనే రోహిత్ శతకం బాదేసి తానేంటో చూపించాడు. నిజానికి రోహిత్ వెనుదిరిగే సమయానికి టీమిండియా గెలుపు దాదాపు ఖరారైంది. చివర్లో అక్షర్ పటేల్, జడేజా మ్యాచ్‌ను గెలిపించేశారు.

మూడు వన్డేల సిరీస్‌లో రెండు గెలిచి సిరీస్‌ను దక్కించుకుంది టీమ్ ఇండియా. ఇక మూడో వన్డే ఈ నెల 12న జరగనుంది. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌లో గెలిస్తే టీమిండియా క్లీన్ స్వీప్ చేయనుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com