24.7 C
Hyderabad
Sunday, September 20, 2026

Live Video

spot_img

తెలంగాణను పోషిస్తోన్న మూడు జిల్లాలు

తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే మంచి స్థాయిలో ఉన్నాయి. రాష్ట్రంలో ఆదాయం విషయంలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఆర్థిక ఉత్పత్తిలో అగ్రభాగంలో కొనసాగుతున్నాయి. ఒక రకంగా ఆ మూడు జిల్లాల నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పోషించగలిగే ఆదాయం సర్కారు ఖజానాకు సమకూరుతోంది.

తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉన్నాయి. వీటిలో మూడు జిల్లాలు ఆర్థిక ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ నివేదికలో ఆ మూడు జిల్లాల ఆదాయం లెక్కలు బహిర్గతమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఇచ్చిన నివేదిక ఆధారంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. ఇందులో తెలంగాణలో కేవలం మూడు జిల్లాలు మాత్రమే మంచి స్థానంలో ఉన్నాయి. రాష్ట్రంలో తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

తెలంగాణలో ఆదాయ వనరుల్లో రంగారెడ్డి జిల్లా అగ్రభాగంలో నిలిచింది. రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్‌ను చుట్టుముట్టి ఉంది. గచ్చిబౌలి, మాదాపూర్‌ వంటి ఐటీ కారిడార్‌లు, శామీర్‌ పేట్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలు, రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వంటి మౌలిక సదుపాయాలతో రంగారెడ్డి జిల్లా ఆర్థికంగా బలంగా ఉంది. జిల్లా జీడీడీపీ రూ.2.85 లక్షల కోట్లుగా ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది.

తెలంగాణ రాష్ట్ర రాజధానిగా ఉన్న హైదరాబాద్‌.. ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా కూడా ఉంది. ఇక్కడ ఐటీ, ఫార్మా, రియల్‌ ఎస్టేట్, సేవా రంగాలు రాష్ట్ర జీఎస్‌డీపీలో దాదాపు 54% వాటాను కలిగి ఉన్నాయి. ఈ జిల్లా ఆర్థిక ఉత్పత్తిలో ఎల్లప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. హైదాబాద్‌ జీడీడీపీ రూ.2.30 లక్షల కోట్లుగా ఉంది. రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది.

హైదరాబాద్‌ మహానగరం సమీపంలో ఉన్న మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా తెలంగాణలో ఆదాయం పరంగా మూడో స్థానంలో నిలిచింది. ఐటీ, తయారీ రంగాలు, వాణిజ్య కార్యకలాపాలతో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఉప్పల్, కుషాయిగూడ వంటి ప్రాంతాలు దీని ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తున్నాయి, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జీడీడీపీ రూ.88,940 కోట్లుగా ఉంది.

ఇక మిగతా జిల్లాలు చూస్తే.. తెలంగాణలోని ‘సోషియో–ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ 2024’ నివేదిక ఆధారంగా ఆ రిపోర్ట్‌లో వివరించిన మరో రెండు జిల్లాలు చూసుకుంటే.. సంగారెడ్డి జిల్లా జీడీడీపీ రూ. 35,717 కోట్లుగా ఉంది. పారిశ్రామిక అభివృద్ధి, హైదరాబాద్‌కు సమీపంలో ఉండటం ఈ జిల్లాకు కలిసి వస్తోంది. అలాగే, నల్గొండ జిల్లా జీడీడీపీ రూ. 27,304 కోట్లుగా తేల్చారు. ప్రధానంగా నల్గొండ జిల్లాలో వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలతో ఆదాయం లభిస్తోంది. అయితే, ఈ జాబితాలో టాప్‌ 5 జిల్లాలు మాత్రమే పేర్కొన్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com