28.6 C
Hyderabad
Thursday, November 5, 2026

Live Video

spot_img

 కశ్మీర్ లా మారిపోయిన రాజస్థాన్

రాజస్థాన్ ఈ పేరు వినిపిస్తే చాలు ఎడారి గుర్తుకువస్తుంది.. మండే ఎండలు, ఇసుక దిబ్బల ప్రాంతం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఫిబ్రవరి నుంచే అక్కడ ఉష్ణోగ్రతలు మండిపోతుంటాయి.. ఎండలతో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. అయితే ఇప్పుడు రాజస్థాన్ రాష్ట్రం కాశ్మీర్ ప్రాంతాన్ని తలపిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలోని చురు ప్రాంతం మంచుతో నిండిపోయింది. వాతావరణ మార్పులతో రాజస్థాన్ లో శుక్రవారం వడగళ్ల వర్షం పడింది. దీంతో ఆ ప్రాంతం మొత్తం మంచు గడ్డలతో నిండిపోయింది. ఫలితంగా కాశ్మీర్ ప్రాంతాన్ని తలపిస్తోంది.

వడగళ్ల వర్షం ధాటికి పంటలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అక్కడ రాగి, సజ్జ, బంగాళదుంప పంటలు కోతకు వచ్చాయి. ఈ సమయంలో వడగళ్లతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. రాజస్థాన్ రాష్ట్రం అంటే నిప్పులు కురిపించే ఎండలు గుర్తుకు వస్తాయి. థార్ ఎడారిలో ఇసుక దిబ్బలు, ఒంటెలతో ఆ ప్రాంతంలో ఒక రకమైన వాతావరణం కనిపిస్తుంది. సాధారణంగా ఫిబ్రవరి నెల నుంచే రాజస్థాన్ రైతులు గొర్రెలు, మేకలు, ఆవులను మేత కోసం ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తుంటారు. జూన్ వరకు అక్కడే ఉంటారు. ఫిబ్రవరి నుంచి రాజస్థాన్ లో ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగానే నమోదవుతుంటాయి. ఇక మార్చిలో ఎండలు మండిపోతుంటాయి. ఏప్రిల్, మే నెలల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

ఫిబ్రవరిలో ఎండలు కొట్టాల్సిన రాజస్థాన్ రాష్ట్రంలో.. వడగళ్ల వర్షం కురిసింది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పులతో మంచు గడ్డలు పడ్డాయి . దీంతో ఆ ప్రాంతం మొత్తం కాశ్మీర్ రాష్ట్రాన్ని తలపిస్తోంది. రాజస్థాన్ లోని కొంత ప్రాంతంలో చలికాలంలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతుంటాయి. ఒకోసారి మంచు ఉంటుంది. అలాంటి వాతావరణం ఫిబ్రవరిలో చోటు చేసుకోవడం అక్కడి ప్రజలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చేతికి వచ్చిన పంటలు దెబ్బ తినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com