29.9 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

ఆ ఇద్దరి టెర్రర్ హబ్స్ చాలా కీలకం!!

  • రెండు కీలక ఉగ్ర స్థావరాలు నేలమట్టం
  • భారత వ్యూహాత్మక మెరుపు దాడిపై ప్రశంసలు
  • మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లిద్దరికీ వేర్వేరు మదర్సాలు
  • అర్ధరాత్రి దాటాక ఆదమరచి ఉండగా దాడి
  • ఊహించని భారత్ ప్రతీకారానికి నివ్వెర పోయినపాక్
  • చనిపోయిన ఉగ్రవాదులకు శ్రద్ధాంజలి, అంత్యక్రియలు
  • ఆ అంత్యక్రియలకు హాజరైన పాకిస్థాన్ ఆర్మీ, ఇతర అధికారులు
  • ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా భారత చర్య

భారత ఆర్మీ నేలకూల్చిన 9 ఉగ్ర స్థావరాల్లో హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజార్ లు నిర్వహిస్తున్న టెర్రర్ హబ్స్ చాలా చాలా కీలకమైనవి. ఇక్కడినుంచే కుప్పలు తెప్పలుగా ఉగ్రవాదులు పుట్టుకొస్తున్నారు.  మన ఆర్మీ అదను చూసి టార్గెటెడ్ గా జరిపిన ఈ దాడి ఉగ్రవాదులకు సమీప భవిష్యత్తులో కోలుకోలేని దెబ్బ.

భారత ఆర్మీ టార్గెట్ చేసి నేల కూల్చిన 9 ఉగ్రస్థావరాల్లో మూడు పాకిస్థాన్ లో ఉండగా, మరో ఐదు పాక్ ఆక్రమిత కశ్మీర్ లో ఉన్నాయి. సవాయ్ నల్లా, సర్జాల్,ముర్డిక్, కొట్లీ, కొట్లీ గుల్పూర్, మెహమూనా జోయా, భీంబర్, బహావల్ పూర్ లలో ఈ దాడులు జరిగాయి. ప్రత్యేకించి నిషేధిత ఉగ్రవాద సంస్థనేతలు హఫీజ్ సయీద్, మసూద్ అజార్ లు నిర్వహిస్తున్న మదర్సాలపైనే ప్రధానంగా ఈ దాడులను గురిపెట్టారు.పాకిస్థాన్ టెర్రర్ నర్సరీగా పిలిచే అల్మా మేటర్ ఆఫ్ టెర్రర్ పై భారతీయ ఆర్మీ క్షిపణి దాడులు చేసింది. మొత్తం 82 ఎకరాల్లో ఉన్న ఈ మసీదులో నిత్యం యువతకు ఉగ్రశిక్షణనిస్తుంటారు. ఇది కరుడుగట్టిన ఉగ్రవాది హఫీజ్ సయీద్ ఆధ్వర్యంలో నడుస్తున్న మసీదు. మంగళవారం అర్ధరాత్రి దాటాక జరిపిన ఈ దాడిలో ఆర్మీ టార్గెట్ ను కరెక్ట్ గా పిన్ పాయింటెడ్ గా ఎంచుకుని మరీ నేలకూల్చింది. ఊహించని ఈ దాడులకు పాకిస్థాన్ నివ్వెర పోయింది. దాడుల విషయం ఊహించని ఉగ్రవాదులంతా ఈ మదర్సాలో ఆదమరచి నిద్రపోతున్నారు. క్షిపణి దాడికి నిద్రలో ఉన్న వారు నిద్రలోనే చనిపోయారు. క్షిపణి ధాటికి  ఆ మదర్సా మంటలకు ఆహుతి అయ్యింది. 80 మందికి పైగానే ఉగ్రవాదులు ఈదాడిలో చనిపోయారని భారత ఆర్మీ అంచనా వేస్తోంది.

బాలలకు హింసా ప్రవృత్తి శిక్షణ

ఈ తీవ్రవాద నేతలు నిర్వహిస్తున్న ఈ మదర్సాలలో నిరుపేద పాకిస్థానీ మగపిల్లలే బాధితులు. చదువు పేరుతో ఇక్కడ చేరే వీరిని మానసికంగా వేధించి ఒక హింసా ప్రవృత్తికి అలవాటు పడేలా చేస్తారు. ఉగ్రకార్యకలాపాల శిక్ణణనిచ్చి వారిలో ఓ హింసోన్మాదాన్ని చొప్పిస్తారు. బాంబుల తయారీ, పేలుళ్లకు ఆపరేషన్ స్కెచ్, స్లీపర్ సెల్స్ గా ఉండటం, దాడులెలా జరపాలి. దాడుల లక్ష్యం ఎలా ఉండాలి? ఎప్పుడు చేయాలి? లాంటి అంశాలలో శిక్షణ ఇచ్చి వారిని మనదేశంపైకి వదులుతున్నారు. శిక్షణ పొందిన ఉగ్రవాదులు సరిహద్దులగుండా చొరబడి  మన దేశంలో అమాయకులపై దాడులు చేస్తున్నారు. భారత్ జరిపిన ఈ ఆపరేషన్ తో కీలక ఉగ్రవాద తండాలు ధ్వంసమైనట్లే.. భారత్ చర్యపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత సునిశిత బుద్ధికి, ఎక్కువ జననష్టం జరగకుండా కేవలం టార్గెట్ ఛేదించడంలో చూపిన తెగువకి ప్రశంసలు అందుతున్నాయి.

ఉగ్రవాదులకు శ్రద్ధాంజలి

ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఉగ్రవాదులకు పాకిస్థాన్ ఆర్మీ అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రద్ధాంజలి ఘటించి అంత్యక్రియలు జరిపింది.లాహోర్ లోని ముడ్రిక్ లో లష్కర్ ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రౌఫ్ తో సహా మరో ఇద్దరు కీలక నేతలు చనిపోయారు.వారి అంత్యక్రియలకు హాజరు కావాలంటూ మసూద్ అజార్ ఇచ్చిన పిలుపు మేరకు పాక్ ఆర్మీ అధికారులు, పోలీసులు, నిషేధిత ఉగ్ర సంస్థ జమావుత్ దావాకు చెందిన హఫీజ్ సయీద్ తదితరులు ఈ అంత్యక్రియలకు హాజరయ్యారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com