28 C
Hyderabad
Tuesday, March 10, 2026

Live Video

spot_img

సిరియా అధ్యక్షుడి పరార్..

 అల్ బషర్ కుటుంబానికి రష్యా ఆశ్రయం

నాటకీయ పరిణామాల మధ్య సిరియా అధ్యక్షుడు దేశం వదలి పారిపోయారు. రెబల్స్ చెలరేగి పట్టణాలను ఒక్కక్కటిగా స్వాధీనం చేసుకోవడంతో సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అసద్  దేశం వదలి విమానంలో గుర్తు తెలియని ప్రాంతానికి వెళ్లిపోయినట్లు సిరియా తాత్కాలిక ప్రభుత్వం ప్రకటించింది. రెబల్స్ ఈ పరిణామాల పట్ల ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశం వదలి పారిపోయిన అల్ బషద్ కుటుంబానికి రష్యా ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. అధ్యక్షుడు పదవీ చ్యుతుడైన వెంటనే కొన్ని గంటల తర్వాత ఈ సమాచారం బయటకు పొక్కింది. అయితే సిరియాలో అంతర్యుద్ధంలో నేరాలకు పాల్పడిన అల్ బషర్ ను వాటికి కారకుడిని చేయాలని శిక్షించాలని అమెరికా డిమాండ్  చేసింది. సిరియాప్రజలు తమ ప్రజాస్వామ్య కలల సౌథాన్ని నిర్మించుకోడానికి ఈ పరిణామాలు ఒక ఘట్టంలా, వేదికగా మారతాయని అమెరికా ఆశాభావం వ్యక్తం చేసింది. అంతేకాదు సిరియాలోని ఐసిస్ ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపింది.

అంతకుముందు హామ్స్, హామాస్, అలెప్పో లాంటి కీలక నగరాలను స్వాధీనం చేసుకున్న రెబల్స్  రాజధాని  డమాస్కస్ ను కూడా స్వాధీనం చేసుకోవడంతో అల్ బషర్ పారిపోయారు.సిరియాలో ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన , ప్రదర్శనలు చేస్తుంటే బషర్ వాటన్నింటినీ ఉక్కు పాదంతో అణిచేశారు. ఇప్పుడు అధ్యక్షుడి పలాయనంతో రెబల్స్ సిరియా సరికొత్త జెండాను వీధుల్లో ఎగరేశారు.

ఏ క్షణాన్నయినా అధికారం చేపడతామని ప్రధాని మహమ్మద్ అల్ జలాలి ప్రకటించారు.డమాస్కస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని ఆర్మీ,ఇతర భద్రతా దళాలు చుట్టుముట్టాయి. అదేసమయంలో నగరంలో వేర్వేరు చోట్ల కాపలా ఉన్న అల్ బషర్ బలగాలు  ఆ ప్రాంతాన్ని వీడి వెళ్లిపోయాయి.

బిక్కు బిక్కుమంటున్న ప్రజలు

అంతకు ముందు రెబల్స్  వ్యూహాత్మకంగా ముందుకు కదులుతూ రాజధానికి చుట్టు పక్కల ఉన్న పట్టణాలను స్వాధీనం చేసుకుంటూ ముందుకు కదిలారు. కీలకమైన హోమ్స్ పట్టణాన్ని చుట్టు ముట్టారు.అయితే సిరియా రక్షణ శాఖ ఈ వార్తలను ఖండించింది.హోమ్స్ పట్టణం తమ కంట్రోల్ లోనే ఉందని ప్రకటించింది.బషర్ అస్సద్ కు మద్దతుగా నిలిచిన హెజ్ బొల్లా ఉగ్రవాద ముఠా తమ దళాలను ఉపసం హరించుకోవాల్సిందిగా ఆదేశించింది.దాంతో ఆ దళాలు కొన్ని సిరియాలోని లటాకియా నరానికి,లెబనాన్ లోని హెర్మల్ నగరానికి వెళ్లి పోయాయి. నియంత్రుత్వ పాలనకు తెరపడిందని తెలియగానే డమాస్కస్ లో రోడ్లన్నీ కిటకిటలాడి కనిపించాయి. ఫుడ్ స్టోర్స్,బేకరీ ల దగ్గర , ఏటీఎంల దగ్గర జనం పోటెత్తారు. డమాస్కస్ శివార్లలో అల్ బషద్ తండ్రి విగ్రహాన్ని ఆందోళనా కారులు తగుల బెట్టారు. ఇరాక్ లోని బాగ్దాద్ వర్గాల ప్రకారం వందలాది సిరియన్ సైనికులను తమ దేశంలో తలదాచుకునేందుకు అనుమతించినట్లు ప్రకటించింది.బషర్ అల్ అసద్ నియంత్రుత్వ పోకడలను నిరసిస్తూ 13 ఏళ్ల క్రితం శాంతియుత నిరసన ప్రదర్శనలతోమొదలైన పోరాటం చివరకు సిరియా అంతర్యుద్దంగా మారిపోయి భారీ నష్టానికి దారి తీసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com