24.9 C
Hyderabad
Tuesday, August 25, 2026

Live Video

spot_img

ఉప్పొంగే శక్తి… మహా శివరాత్రి

పరిణామ ప్రక్రియలో జంతువుకు జరిగిన మార్పులలో అతిపెద్ద మార్పు ఏమిటంటే సమాంతరంగా ఉన్న వెన్నుముక నిటారుగా రూపంతరం చెందడమేనని జీవశాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ పరిణామం తరువాతే మేధ వికసించింది. కాబట్టి, మహాశివరాత్రిన సహజంగానే ఉప్పొంగే శక్తిని, ఇంకా రాత్రంతా జరుపుకునే వేడుకలో సరైన మంత్రాలు ,ధ్యానాలతో మనం దైవానికి మరో అడుగు దగ్గర కావచ్చు.

జీవితంలో ఎటువంటి సాధన లేని వారికి కూడా ఈరోజున శక్తి ఉప్పొంగుతుంది. ప్రత్యేకించి, ఏదైనా యోగ సాధనలో ఉన్నవారు , వారి శరీరాన్ని నిటారుగా ఉంచుకోవటం ,అంటే ఈ రాత్రి నిద్రించకుండా ఉండడం ఎంతో అవసరం.

ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారికి ఇంకా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి, కుటుంబ పరిస్థితులలో ఉన్నవారికి కూడా మహాశివరాత్రి ఎంతో ప్రాముఖ్యమైనది. కుటుంబ పరిస్థితులలో ఉండేవారు, మహాశివరాత్రిని శివుని పెళ్లిరోజుగా చూస్తారు. విజయ కాంక్ష ఉన్నవారు, ఈ రోజును శివుడు తన శత్రువులందరినీ జయించిన రోజుగా చూస్తారు. కానీ యోగ సంప్రదాయంలో శివుణ్ణి దేవుడిగా భావించరు, యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. “శివ” అనే పదానికి అర్థం ఏమిటంటే “ఏదైతే లేదో అది”. మీరే ముఖ్యం అన్న స్థితిలో కాకుండా, శివుణ్ణి మీలోకి ఆహ్వానించే స్థితిలో ఉంటే, మీ జీవితాన్ని ఒక కొత్త కోణంలో ఇంకా పూర్తి స్పష్టతతో చూసే అవకాశం ఉంటుంది.

యోగ గాథల్లో, గణాలు శివుని అనుచరులు. ఆయన చుట్టూ ఎప్పుడూ వాళ్లే ఉంటారు. ఆయనకి శిష్యులు, భార్య, ఎందరో అభిమానులు ఉన్నప్పటికీ ఆయన ఆంతరంగికులు గణాలే. గణాలను వికృతంగానూ, వెర్రిగానూ ఉంటారని భావిస్తారు. వాళ్ల శరీరం నుండి కాళ్లూ చేతులూ ఎముకలు లేకుండా సాధారణమైన చోట్ల నుండి కాక భిన్నస్థానాల నుండి మొలిచి ఉంటాయట. అందుకనే వాళ్లు వికృతంగా ఉంటారు, ఉన్మాదంతో ఉంటారని వర్ణిస్తారు. అంటే వాళ్లు మనకంటే భిన్నంగా ఉంటారు. యోగ సాంప్రదాయంలో, శివుడిని ఆదియోగిగా భావిస్తారు. యోగాకు మూలం ఆదియోగి. ప్రతి ఒక్కరూ వారి పరిమితుల్ని అధిగమించే సంభావ్యతను ఆయన మానవాళి మొత్తానికి అందించారు.వాళ్లలా భిన్నంగా ఎలా ఉంటారు? ఇది జీవితంలో ఒక కోణం, అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు. శివుణ్ణి యక్షస్వరూపుడిగా వర్ణిస్తూ ఉంటారు. యక్షుడు అంటే మరో లోకానికి చెందినవాడు. దాదాపు 15,000 సంవత్సరాల కిందట శివుడు ప్రస్తుతం టిబెట్టులో ఉన్న మానస సరోవరానికి వచ్చాడు. అది తేథిస్ సముద్ర అవశేషం అంటారు. ఇక్కడే అనేక మానవ సంస్కృతులు ఉద్భవించాయి. ఇవ్వాళ అది సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తున ఉంది. కాని, వాస్తవానికది ఒక సముద్రం. పైకి వచ్చి సరోవరమయింది.

శివుని అనుచరులైన గణాలు మనుషుల్లాంటి వాళ్లు కాదు. వాళ్లెప్పుడూ ఏ మనుష్య భాషనూ మాట్లాడినట్లు తెలియదు. వాళ్లు మాట్లాడేదంతా శుద్ధ రణగొణ ధ్వనిలాగా ఉంటుంది. శివుడు, ఆయన అనుచరులు మాట్లాడుకునేటప్పుడు ఎవరికీ అర్థం కాని భాష మాట్లాడుకుంటారు. మనుషులకు అదంతా రణగొణ ధ్వనే. కాని శివుడు నిజంగా సన్నిహితంగా ఉండేది గణాలతోనే.

మీకు గణపతి తలను పోగొట్టుకున్న కథ తెలుసుకదా. శివుడు వచ్చినప్పుడు గణపతి అడ్డుపడ్డాడు. శివుడు అతని తల తీసి వేశాడు. పార్వతి దుఃఖించింది. శివుణ్ణి ప్రార్థించింది గణపతిని తిరిగి బతికించమని. శివుడు ఒక జీవి తలని తొలగించి దాన్ని పిల్లవాడికి అతికించాడు. ఈ జీవి ఏనుగు అని చెప్పడం జరిగింది. కాని మీరు అర్థం చేసుకోవలసిందేమిటంటే ఎవరూ అతన్ని “గజపతి” అనలేదు. మనం అతన్ని ఎల్లప్పుడూ “గణపతి” అనే అంటాం. నిజానికి శివుడు తన స్నేహితుడి తల తీసి బాలుడికి తగిలించాడు. గణాలకు, కాళ్లూ చేతులకు ఎముకలు లేవు. అందువల్ల ఈ పిల్లవాడు గణపతి అయ్యాడు. ఎందుకంటే ఈ సంస్కృతిలో ఎముకలు లేని అవయవాన్ని ఏనుగు తొండం అంటారు – కాని వాస్తవానికి అతను గజపతి కాదు, గణపతి. అతనికి గణాలలో ఒకడి తలను శివుడు తీసి అమర్చాడు, అతన్ని గణాలకు అధిపతిని చేశాడు. మనం శివుడిని మరొకరితో పోల్చి మాట్లాడటం లేదు. మీరు దేన్నైతే శివునిగా భావిస్తారో, అందులో ప్రతీదీ ఇమిడి ఉంటుంది.

మానవాళికి గొప్ప సేవ చేసిన అద్భుతమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కానీ గ్రహణశక్తి పరంగా చూస్తే, శివుడిలా మరొకరు లేరు. శివుడు మనుషులకు 112 మార్గాలు మాత్రమే ఉన్నాయి” అని చెప్పి, మనిషి ముక్తి పొందడానికి 112 మార్గాలను సూచించారు. ఈ జీవితం ఎలా నిర్మించబడిందనే విషయాన్ని తెలుసుకోవడానికి, ఈ 112 పార్శ్వాలను ఎలా ఉపయోగించుకోవాలో స్పష్టమైన పద్ధతుల్ని చూపించారు. వీటిలో ప్రతి ఒక్కదాని ద్వారా, మీరు ముక్తి పొందగలరు. శివుడు మాట్లాడేది జీవితపు విధివిధానాల గురించి, అందులో ఫిలాసఫీ లేదు, బోధన లేదు, సామాజిక ఔచిత్యం ఉండదు- కేవలం సైన్సు మాత్రమే ఉంటుంది. ఈ సైన్సు నుంచి, గురువులు టెక్నాలజీని రూపొందిస్తారు. అతను సైన్సుని అందించాడు. మీరు నేడు వాడుతున్న టెక్నాలజీ, అది స్మార్ట్‌ఫోన్ కావచ్చు, కంప్యూటర్ కావచ్చు లేదా మరేదైనా గ్యాడ్జెట్ కావచ్చు, వాటి వెనుక సైన్సు ఉంది. ఆ సైన్సు మీకు అవసరం లేదు. మీరు ఆ టెక్నాలజీని మాత్రం వాడుకుంటున్నారు. కానీ ఎవరూ ఆ సైన్సుని గ్రహించకుండా ఉండుంటే, మీకు ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి ఉండేది కాదు. కాబట్టి శివుడు చెప్పినది కేవలం పరిపూర్ణమైన సైన్సు మాత్రమే. తమ ముందు కూర్చునేవారికి సరిపోయే విధంగా టెక్నాలజీని తీర్చిదిద్దుకునే బాధ్యతను శివుడు సప్తరుషులకే వదిలేశాడు. టెక్నాలజీని తయారుచేసుకోవచ్చు. మనకు అవసరమైన దాన్ని బట్టి, మనం ఒక గ్యాడ్జెట్‍ని తయారుచేసుకుంటాం, కానీ ప్రాథమిక విజ్ఞానం అనేది ఒకటే ఉంటుంది. ఈరోజు ఉపయోగపడే గ్యాడ్జెట్‍లు, రేపు పనికిరాకపోవచ్చు. మనం ఒకప్పుడు చాలా విలువైనవిగా భావించిన చాలా గ్యాడ్జెట్‍లు ఇప్పుడు విలువైనవి కావు, ఎందుకంటే కొత్త గ్యాడ్జెట్‍లు వచ్చాయి – కానీ సైన్సు మాత్రం అదే.

కాబట్టి ఆదియోగి విషయంలో, మనం ప్రాథమిక విజ్ఞానాన్ని పరిశీలిస్తున్నాము. వివిధ కారణాల వల్ల మానవాళి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ప్రాథమిక విజ్ఞానాన్ని బలోపేతం చేయడం చాలా ముఖ్యం. కేదార్‍నాథ్ ఒక బ్రహ్మాండమైన ప్రదేశం. ఇక్కడ “శివ” అనే శబ్దాన్ని ఉచ్చరించడం సరికొత్త పార్శ్వాన్ని అలాగే ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. ఇది ఈ శబ్దం కోసం ప్రత్యేకంగా సిద్ధం చేయబడిన ప్రదేశం. ”మనం “శివ” అనే పదాన్ని ఉచ్ఛరించినప్పుడు, అది సృష్టించబడని దాని యొక్క స్వేచ్ఛ, సృష్టించబడని వ్యక్తి యొక్క విముక్తి. ఇలా అనడం సరి కాదేమో గాని, ఈ భూమ్మీద “శివ” అనే శబ్దం కేదార్‍నాథ్ నుండే ఉద్భవించినట్లు అనిపిస్తుంది. ఎన్నో వేల ఏళ్ల పాటు, ప్రజలు ఈ ప్రదేశాన్ని ఆ శబ్దం యొక్క ప్రతిధ్వనిగా అనుభూతి చెందారు. మనం “శివ” అన్నప్పుడు, అది ఏదో ఇంకొక విగ్రహాన్ని లేదా దేవుణ్ని మరింత ఐశ్వర్యం కోసమో లేదా సౌకర్యాల కోసం అడగటానికి సృష్టించినది కాదు. “శివ” అంటే, “ఏదైతే కానిదో అది” అని. ఇవాళ, ఆధునిక శాస్త్రం కూడా ఈ సృష్టి అంతా శూన్యం లోంచి వచ్చి, మళ్ళీ శూన్యంలోకే వెళ్తుందని నిరూపిస్తోంది. ఈ సృష్టి యొక్క మూలం మరియు ఈ విశ్వం యొక్క ప్రాథమిక గుణం అనంతమైన శూన్యమే. ఈ నక్షత్ర మండలాలన్నీ చాలా చాలా చిన్నవి – ఒక చిలకరింపు అంతే . మిగిలినదంతా అనంత శూన్యం. దానినే ‘శివ’ అని అంటారు.

మహాశివరాత్రి హిందువులు ఆచరించే ఒక ముఖ్యమైన పండగ. ఇది శివ, పార్వతుల వివాహం జరిగిన రోజు. ఈ రోజు రాత్రి శివుడు తాండవం చేసే రోజు. హిందువుల క్యాలెండరులో ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో వేసవి కాలం ముందు వచ్చే మాఘ మాసంలో (ఫిబ్రవరి లేదా మార్చి) వచ్చే 13 లేదా 14 వ రోజుని మహాశివరాత్రి అంటారు. శివ రాత్రి చాంద్రమాన నెల లెక్కింపు ప్రకారం మాఘమాసం కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. హిందువుల పండుగలలో మహాశివరాత్రి ప్రశస్తమైనది. ప్రతీ ఏటా మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు వస్తుంది. శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. చాంద్రమాన నెల లెక్క ప్రకారం, ఈ రోజు గ్రెగేరియన్ క్యాలెండర్లో ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. హిందువుల క్యాలెండర్ నెలలో మాఘ మాసం కృష్ణ పక్ష చతుర్దశి. సంవత్సరంలో పన్నెండు శివరాత్రులలో మహా శివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది.

–అప్పరుసు మనోజ్ కాశ్యప

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com