24.4 C
Hyderabad
Monday, March 16, 2026

Live Video

spot_img

డిసెంబర్ 20న సారంగపాణి జాతకం

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన సినిమా ‘సారంగపాణి జాతకం’. ప్రియదర్శి, రూప కొడువాయూర్ జంటగా నటించారు. ‘జెంటిల్‌మన్’, ‘సమ్మోహనం’ విజయాల తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి, శివలెంక కృష్ణప్రసాద్ కలయికలో రూపొందుతున్న మూడో చిత్రమిది. డిసెంబర్ 20న థియేటర్లలోకి వస్తుందీ సినిమా. టైటిల్ సాంగ్ ‘సారంగో సారంగో…’ కొన్ని రోజుల క్రితం విడుదలైంది. రెండో పాట ‘సంచారి… సంచారి…’ని ఈ రోజు విడుదల చేశారు.

‘సంచారి సంచారి… ఎటువైపో నీ దారి
చిరునామా లేని లేఖలా… చెలి కాటుక చీకటి రేఖలా’
అంటూ సాగిన ఈ గీతాన్ని ‘సరస్వతీపుత్ర’ రామజోగయ్య శాస్త్రి రాశారు. వివేక్ సాగర్ స్వరపరిచిన అందమైన బాణీకి సంజిత్ హెగ్డే గాత్రం తోడు కావడంతో పాటలో విరహ వేదన అందంగా ఆవిష్కృతం అయ్యింది.

‘సంచారి సంచారి…’ పాట గురించి దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి మాట్లాడుతూ… ‘సారంగపాణి జాతకం’ సినిమాలో ప్రధానమైన అంశం ప్రేమ. తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి, తన నమ్మకానికి మధ్య నలిగిపోయిన వ్యక్తి కథే ‘సారంగపాణి జాతకం’. ‘సంచారి’ అనే పాట తన నమ్మకం వల్ల తాను ప్రాణంగా ప్రేమించే అమ్మాయిని కోల్పోయే సందర్భంలో వస్తుంది.

ప్రియదర్శి పులికొండ, రూప కొడువాయూర్ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్ విజయకృష్ణ, తనికెళ్ళ భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కె.ఎల్.కె, మణి, ‘ఐమ్యాక్స్’ వెంకట్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి మేకప్ చీఫ్: ఆర్.కె వ్యామజాల, కాస్ట్యూమ్ చీఫ్: ఎన్. మనోజ్ కుమార్, కాస్ట్యూమ్ డిజైనర్స్: రాజేష్ కామర్సు – అశ్విన్, మార్కెటింగ్: టాక్ స్కూప్, పీఆర్వో: పులగం చిన్నారాయణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: కె. రామాంజనేయులు (అంజి బాబు) – పి రషీద్ అహ్మద్ ఖాన్, కో డైరెక్టర్: కోట సురేష్ కుమార్, పాటలు: రామ జోగయ్య శాస్త్రి, స్టంట్స్: వెంకట్ – వెంకటేష్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: పీజీ విందా, సంగీతం: వివేక్ సాగర్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణా రెడ్డి, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్, రచన – దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com