- దీని భావమేమి తిరుమలేశా?
- పొంతన లేని పోల్ పర్సంటేజ్ లు… ఫలితాలు..
దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై అనుమానాలు,సందేహాలు వెల్లువెత్తుతున్న తరుణంలో మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మరోసారి ఈ అనుమానాలు బలపడేవిగా కనిపిస్తున్నాయి.పోల్ పర్సంటేజ్,వచ్చిన ఫలితాలకు పొంతన కుదరకపోవడం పరిశీలకులను సైతం ఆ్చర్యపరుస్తోంది.మహారాష్ట్ర పోలింగ్ సరళి చూసినట్లయితే పోలింగ్ ముగిసే సమయంలో అంచనాలకు మించి పోలింగ్ జరిగినట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించిన పోల్ పర్సంటేజ్ లు తెలియచేస్తున్నాయి.పోలింగ్ ముగిసే సమయానికి, ఆ తర్వాత ఎనౌన్ష్ చేసిన పర్సంటేజ్ లకి లాజిక్ కి అందనంత వేరియేషన్ కనిపిస్తోంది.
దాదాపు 8శాతం పోలింగ్ అదనంగా జరిగినట్లు ఈసీలెక్కలు చెబుతున్నాయి.ఈవీఎం ల టాంపరింగ్ అనిగానీ, మరాఠా గడ్డపై ఎన్డీఏ ఎన్నిక లొ గోల్ మాల్ జరిగిందనిగానీ అనలేం ..కానీ ఎలక్షన్ కమిషన్ ప్రకటించిన పోల్ పర్సంటేజ్ లు విచిత్రంగా అనిపిస్తున్నాయి.పోలింగ్ జరిగిన 20వ తేదీన అక్కడ సాయంత్రం 5గంటలకు 58 శాతం పోలింగ్ జరిగినట్లు ఈసీ ప్రకటించింది. అదే రాత్రి పోలింగ్ పూర్తిగా ముగిసే సమయానికి పోల్ పర్సంటేజ్ 65.02శాతంగా ఈసీ ప్రకటించింది. కౌంటింగ్ జరిగే రోజున ఈ పర్సంటేజ్ ను66.02 శాతంగా అధికారులు ప్రకటించారు.అంటే ఒక్కసారిగా 7.83 శాతం పెరిగినట్లు లెక్క. అంటే సాయంత్రం 5 నుంచి రాత్రి 11.30 లోపు 7.83 శాతం పోలింగ్ జరిగినట్లు లెక్క.ఈసీ ఇచ్చిన లెక్కల ప్రకారం సాయంత్రం 5నుంచి రాత్రి 11.30 లోపు 66 లక్షల మంది ఓటు వేసినట్లు లెక్క తేలింది. ఇదే ఒక విచిత్రం అనుకుంటే కౌంటింగ్ కొద్ది నిమిషాల ముందు ఆ తేడా ఇంకా భారీగా కనిపించింది.9.56 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లు చూపించారు. అంటే దాదాపు పది లక్షలనమాట. మొత్తంగా లెక్కిస్తే 20వ తేదీన సాయంత్రం 5నుంచి రాత్రి 11.30 మధ్య పెరిగిన పోలింగ్ కి, కౌంటింగ్కు 12 గంటల ముందు ఈసీ ఇచ్చిన ఫిగర్స్ కు 75,97,067 ఓట్లు అదనంగా కనిపిస్తున్నాయి. అంటే దాదాపు 76 లక్షల ఓట్లు.టూకీగా చెప్పుకోవాలంటే మహారాష్ట్ర ఎన్నికల్లో పోలింగ్ రోజున సాయంత్రం 5నుంచి రాత్రి 11.30 మధ్యలో 76 లక్షల మంది ఓటేసినట్లు లెక్క. ఒకవేళ5 దాటాక కూడా క్యూలో మిగిలి పోయిన వారు ఓటు హక్కు వినియోగించుకున్నారనుకున్నా, ఆరు గంటల్లో 76 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం అసలు సాధ్యమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి.సాధారణంగా ఈసీ ప్రకటించే టెంపరరీ పోల్ పర్సంటెజ్ కు, ఫైనల్ ఫిగర్ కు ఒక్క శాతం తేడా అటూ, ఇటూగా ఉంటుంది. కానీ టెంపరరీ పోల్ పర్సంటేజ్ కు ఫైనల్ ఫిగర్ కు 7.83 శాత తేడా అనేది చాలా చాలా అసాధారణ విషయం. ఆరుగంటల్లో 76 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం అసాధారణం.. ఆశ్చర్య కరం.
పోనీ చివరి నిమిషంలో ఎక్కువ మంది ఓటు హక్కు వినియోగించుకున్నారనుకున్నా..వెయ్యిమంది ఓటేస్తే ఒక్కక్కళ్లకి ఒక్క నిమిషం చొప్పున లెక్కించినా వెయ్యి మంది ఓటేయాలంటే వెయ్యి గంటలు అంటే కనీసం 16 గంటలు పడుతుంది.కానీ సాయంత్రం 5 నుంచి రాత్రి 11.30 మధ్య (అంటే ఆరుగంటల వ్యవధిలో) 76 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోవడం సాధ్యమేనా? దాదాపు 8 శాతం పోలింగ్ పెరగడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? పొనీ ఈసీ లెక్కలే నిజమనుకున్నా ఆరు గంటల్లో 76 లక్షల మంది ఓటేస్తే .. ఉదయం నుంచి అసలు పోలింగ్ జరగలేదనుకోవాలా? మరి సాయంత్రం 5 గంటల వరకూ58.22 శాతం మంది ఓటేసినట్లు ఈసీ చెబుతోంది. ఈతేడాలకు ఎన్నికల కమిషనే సమాధానం చెప్పాలి. పోనీ ఒక్కసారిగా అంత పోలింగ్ పెరిగినట్లు అనుకున్నా, పోలింగ్ ను వీడియో గ్రఫీ చేస్తారు? తండోపతండాలుగా వచ్చిన ఓటర్ల విజువల్స్ అయినా ఈసీ బయటపెట్టలేదు.
మరోవైపు అదే టైమ్ లో జార్ఖండ్ లో పోల్ పర్సంటేజ్ లు ఇంకోలా ఉన్నాయి. జార్ఖండ్ లో పోలింగ్ టైమ్ ముగిసినప్పటి పర్సంటేజ్ కు చివరి పర్సంటేజ్ కు మధ్యకేవలం 1నుంచి 2 శాతం పెంపుదల మాత్రమే కనిపిస్తోంది. ఇక్కడ రెండు రోజుల పోలింగ్ జరిగింది. తొలిదశ పోలింగ్ జరిగిన 30 సీట్లలో ఎన్డీఏ గెలిచినవి కేవలం 7 సీట్లు. దీన్ని బట్టి చూస్తే మహారాష్ట్రలో పెరిగిన పోలింగ్ కు గెలిచిన పార్టీకి మధ్య ఏదైనా లింక్ ఉందా? ఎన్నికల విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్న సంఘటన ఇది. ఈవీఎంల పనితీరుపై సందేహాలు వెల్లువెత్తుతున్నవేళ, మహారాష్ట్ర ఫలితాలు ఈవీఎం లపైనే సందేహాలు కలిగేలా ఉన్నాయి.
మరోవైపు కాంగ్రెస్ ఎన్నికల అవకతవకలపై విచారణ జరపాలంటూ ఇచ్చిన కంప్లయింట్ నుకూడా మహారాష్ట్ర ఎన్నికల అధికారి చొక్కలింగం కొట్టి పారేశారు. ఏ నియోజక వర్గంలోనూ పెద్ద సంఖ్యలో ఓటర్ల తొలగింపు గానీ, చేర్చడం కానీ జరగలేదంటున్నారు. పైగా పోలింగ్ కు సంబంధించిన ఈవీఎంలను గుజరాత్ నుంచి తెచ్చారనడం కూడా అబద్ధమేనని అంటున్నారు.మరి ఏదీ జరగకుండా.. ఈ ఫలితాలు ఎలా వచ్చాయి అన్న దానికి మాత్రం నో ఆన్సర్.