32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారు

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమయ్యింది. ఈ అంశంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇవాళ రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజ్‌ భవన్‌ వెళ్లనున్న సీఎం రేవంత్‌.. గవర్నర్‌తో భేటీ అవుతారు. కేబినెట్‌ విస్తరణపై గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మతో రేవంత్‌ రెడ్డి చర్చిస్తారు.

మంత్రివర్గ విస్తరణలో కొత్తగా నలుగురికి స్థానం దక్కే అవకాశం కనిపిస్తోంది. అధిష్టానం కూడా నలుగురికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఏప్రిల్‌ మూడో తేదీన మంత్రివర్గ విస్తరణ చేసేందుకు ప్రభుత్వం ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఈ అంశంపైనే గవర్నర్‌కు సమాచారం ఇచ్చేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా రాజ్‌భవన్‌ వెళ్తున్నారు.

ప్రస్తుతం కేబినెట్‌ విస్తరణలో మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్‌ రెడ్డి, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి, నిజామాబాద్‌ నుంచి పెద్ది సుదర్శన్‌ రెడ్డి, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, ఇబ్రహీం పట్నం ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి తదితరులు సీరియస్‌గా ప్రయత్నిస్తున్నారు.

Bhaskara News
Bhaskara Newshttps://bhaskaranews.com/
నేమాని మీడియా హౌస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీడియా విభాగాల్లో భాస్కర న్యూస్ (bhaskaranews.com)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com