39.2 C
Hyderabad
Saturday, May 2, 2026

Live Video

spot_img

అక్షరధామ్‌ సందర్శించిన జేడీవాన్స్‌ కుటుంబం

అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ తన భార్య ఉషా వాన్స్ వారి ముగ్గురు పిల్లలతో కలిసి ఢిల్లీలోని స్వామి నారాయణ్‌ అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంతో పాటు సాంస్కృతిక మార్పిడిలో పాల్గొనే లక్ష్యంతో నాలుగు రోజుల పాటు భారతదేశంలో పర్యటనకు జేడీ వాన్స్‌ కుటుంబంతో సహా సోమవారం ఇండియాకి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ అక్షరధామ్‌ సందర్శించారు. వాన్స్‌ కుటుంబం సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో పాలం ఎయిర్‌ బేస్‌కు చేరుకున్నారు. అక్కడ వారికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ స్వాగతం పలికారు. అనంతరం అక్షరధామ్‌ దేవాలయాన్ని సందర్శించారు.

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్‌ భారత్‌ పర్యటన వ్యక్తిగతంగా కూడా జరుగుతోంది. ఆయన సతీమణి ఉషా వాన్స్‌ భారత సంతతికి చెందిన వ్యక్తి. ఈ పర్యటనలో వాన్స్‌ కుటుంబం తాజ్‌మహల్‌, అమెర్‌ కోటలు కూడా సందర్శించనున్నారు. అలాగే ఉపరాష్ట్రపతితో జరిగే అధికారిక సమావేశంలో కూడా జేడీ వాన్స్‌ పాల్గొంటారు. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కూడా భేటీ అయి అమెరికా, ఇండియాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రాంతీయ భద్రతా తదితర విషయాలపై చర్చించనున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com