32.2 C
Hyderabad
Thursday, April 23, 2026

Live Video

spot_img

గొంగడి త్రిషకు కోటి నజరానా ప్రకటించిన సీయం

మహిళల అండర్‌ 19 క్రికెట్‌ ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన భద్రాచలం బిడ్డ గొంగడి త్రిషకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోటి రూపాయల నజరానాను ప్రకటించారు. బుధవారం జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయన్ను మహిళా క్రికెటర్‌ గొంగడి త్రిష మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అండర్‌ 19 ప్రపంచకప్‌లో అత్యంత ప్రతిభ కనబరిచిన త్రిషను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభినందించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింత అద్భుతంగా రాణించాలని ఈ సందర్భంగా సీయం ఆకాంక్షించారు. వరల్డ్‌కప్‌లో ప్రతిభావంతమైన ఆటతీరు కనబరచి తెలంగాణ రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకు వచ్చినందుకు త్రిషకు కోటి రూపాయల ప్రోత్సాహకాన్ని సీయం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అలాగే అండర్‌ 19 వరల్డ్‌ కప్‌ జట్టు సభ్యురాలైన తెలంగాణకు చెందిన కేసరి ధృతికి పది లక్షలు నజరానా ప్రకటించారు. వీరిద్దరితో పాటు అండర్‌19 వరల్డ్‌ కప్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌ నౌషీన్‌, ట్రైనర్‌ షాలినిలకు కూడా చెరో పదిలక్షల చొప్పున ప్రోత్సాహక బహుమతులు సీయం రేవంత్‌ రెడ్డి అనౌన్స్‌ చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com