రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర మంత్రి కే అచ్నెన్నాయుడు అమరావతిలో వెల్లడించారు. ప్రకృతి విపత్తులు, తుఫానులతో దెబ్బ తిన్న ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. వ్యవసాయంపై చర్చకు వచ్చేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ధైర్యం ఉందా అని మంత్రి ప్రశ్నించారు.
గత ప్రభుత్వంలో ధాన్యం సేకరించి, రైతులకు డబ్బు చెల్లించే పరిస్థితి లేదని ఆరోపించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. వ్యవసాయ రంగాన్ని గాడిలో పెట్టేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తున్నదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.