22.6 C
Hyderabad
Sunday, November 1, 2026

Live Video

spot_img

నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి.. అల్లు అర్జున్

సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరం అన్నారు పుష్ప హీరో అల్లు అర్హున్,  ఇది ఒక యాక్సిడెంట్ అని ఇందులో ఎవరిది తప్పులేదని ఈరోజు జూబ్లీహిల్స్ లోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమేవేశంలో చెప్పారు. అంతా మంచి జరగాలనుకున్నా, అనుకోని ప్రమాదం జరిగింది.ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం.. ఈ విషయంలో నేను చాలా చాలా బాధపడుతున్నా అన్నారు అల్లు అర్జున్‌. సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్‌ చేయాలన్కుంనదే తన లక్యమన్న అల్లు అరజున్.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాని చెప్పుకొచ్చారు.

శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదు.20 ఏళ్లుగా నన్ను మీరంతా  చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా , నాపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయి..మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లాను. నేను పోలీసుల డైరెక్షన్‌లో వెళ్లాను.. వాళ్లే ట్రాఫిక్‌ క్లియర్ చేశారు.నేను రోడ్‌షో, ఊరేగింపు చేయలేదు.. అంత మంది ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారు థియేటర్‌లో ఏ పోలీస్ నన్ను కలవలేదు. మా వాళ్లు చెబితేనే నేను వెళ్లిపోయానని..రేవతి చనిపోయిందని తర్వాతి రోజే నాకు తెలిసిందని వివరించారు… నా పిల్లలతో కలిసి సినిమా చూశాను, అలా జరిగిందని నాకు తెలియదు.తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని మావాళ్లు చెప్పారు అని మీడియాకు వివరించారు..అల్లు అర్జున్.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com