29.3 C
Hyderabad
Sunday, March 15, 2026

Live Video

spot_img

చిన్నారులపై సోషల్ మీడియా పంజా

పసిమొగ్గపై మూడో తరగతి బాలుడి లైంగిక వేధింపులు

సోషల్ మీడియా పసిపిల్లలపైనా ప్రభావం చూపిస్తోందనడానికి ఈ ఘటనే ఉదాహరణ.. పట్టుమని పదేళ్ల వయసైనా లేని ఓ పూనే కు చెందిన ఓ కుర్రాడు మూడేళ్ల పాపపై లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం స్రుష్టించింది. పునేలోని కొంద్వా ప్రాంతంలో తొమిదేళ్ల ఓ కుర్రాడిపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు నమోదైంది. బాలుడి వయసు రీత్యా అతన్ని విచారించిన జివెనైల్ బోర్డు ఘాటైన హెచ్చరికల తర్వాత ఆ బాలుడిని తల్లి దండ్రుల కస్టడీకి తరలించింది. వాస్తవానికి తొమ్మిదేళ్ల ఆ కుర్రవాడు స్థానికంగా ఓ స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. పక్కింట్లో ఉండేమరో చిన్నారితో ఆ కుర్రాడికి స్నేహం.. అన్నా.. అన్నా అని ముద్దు ముద్దుగా పిలిచే ఆ చిన్నారిని ఇటీవల లైంగికంగా వేధించి , అసభ్యప్రవర్తనతో గందరగోళ పెట్టాడు.. ఆ బాలుడి ప్రవర్తనకు ఖంగు తిన్న ఆ పసిమొగ్గ తల్లి దండ్రులకు మొత్తం విషయం చెప్పింది. వెంటనే ఆ తల్లి పోలీసులకు కంప్లయింట్ చేయడంతో కేసు వెలుగులోకి వచ్చింది. ఘటన పూర్వ పరాలను పరిశీలించిన పోలీసులుముందు బాధిత బాలికను బాలల హక్కుల సంఘం సమక్షంలో ప్రశ్నించారు. ఆ తర్వాత ఆ బాలుడిని పసిపిల్లల నేరాలను పర్యవవేక్షించి శిక్ష విధించే జువైనల్ బోర్డు ముందు మరోసారి విచారించారు. ఇలాంటి ప్రవర్తన సమంజసం కాదని గట్టిగా హెచ్చరించి ఆ పిల్లాడిని తల్లి దండ్రులకు అప్పగించారు. ఆలస్యంగా వెలుగు లోకి వచ్చిన ఈ ఘటన సంచలనంగా మారింది.అయితే ఆ తొమ్మిదేళ్ల చిన్నారి అనుచిత ప్రవర్తనకు సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడమే కారణమని పోలీసులు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement with us -

తాజా వార్తలు

Social Media Auto Publish Powered By : XYZScripts.com